Janhvi Kapoor : అంబానీ ఇంట పెళ్లి వేడుక.. సందడి అంతా జాన్వీ కపూర్‌దే..
అందరికంటే ఎక్కువగా అనంత్ - రాధికా వేడుకల్లో హైలెట్ అయింది జాన్వీ కపూర్.
- Saketh U
- Published On : March 4, 2024 / 08:46 AM IST
Janhvi Kapoor Entertained in Anant Radhika Pre Wedding Celebrations
Janhvi Kapoor : ముకేశ్ అంబానీ(Mukesh Ambani) తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ జామ్ నగర్ లో గత నాలుగు రోజులుగా గ్రాండ్ గా జరిగాయి. దేశ విదేశాల నుంచి ఎంతోమంది బిజినెస్, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక బాలీవుడ్ బ్యాచ్ అంతా అనంత్ – రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకలో హంగామా చేశారు.
అందరికంటే ఎక్కువగా అనంత్ – రాధికా వేడుకల్లో హైలెట్ అయింది జాన్వీ కపూర్. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్ లో దేవర సినిమాతో త్వరలో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలతో హడావిడి చేస్తుంది.
అనంత్ – రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో జాన్వీ కపూర్ మాములు హంగామా చేయలేదు. మూడు రోజులుగా రకరకాల డ్రెస్సుల్లో కనిపించి అదరగొట్టింది. మామూలుగానే హాట్ డ్రెస్సులతో సరికొత్త ఫ్యాషన్ తో రెడీ అయ్యే జాన్వీ ఇక అంబానీ ఇంట్లో పెళ్లి అంటే ఏ రేంజ్ లో రెడీ అవ్వాలి. అందుకే రోజుకొక సరికొత్త డ్రెస్సుల్లో తన అందాలతో అందర్నీ మైమరిపించింది.
ఈ వేడుకల్లో జాన్వీ వరల్డ్ పాప్ సింగర్ రిహన్నతో కలిసి స్టెప్పులేసి వైరల్ అయింది. మరో పక్క బాలీవుడ్ వారసురాళ్లందరితో కలిసి స్టేజిపై డ్యాన్స్ చేసింది. మరోపక్క కాబోయే పెళ్లికూతురు రాధికా నడిచొస్తుంటే హారతులిచ్చింది. దీంతో జాన్వీ ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. మొత్తానికి అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకల్లో జాన్వీ కపూర్ బాగానే సందడి చేసింది.
