×
Ad

Janhvi Kapoor : ‘పెద్ది’ సినిమాపై జాన్వీ కామెంట్స్.. ఐ లవ్ రామ్ సర్ అంటూ.. ఇంకా హైప్ పెంచేసిందిగా..

బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ పెద్ది సినిమా గురించి, బుచ్చిబాబు, రామ్ చరణ్ గురించి మాట్లాడింది. (Janhvi Kapoor)

Janhvi Kapoor

Janhvi Kapoor : బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తెలుగులో కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేవర సినిమాలో అలా కాసేపు మెరిపించిన జాన్వీ ఇప్పుడు రామ్ చరణ్ సరసన పెద్ది సినిమా చేస్తుంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చరణ్, జాన్వీ జంటగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ తో సినిమాపై మరింత హైప్ నెలకొంది.(Janhvi Kapoor)

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో క్రికెట్ నేపథ్యంలో ఈ పెద్ది సినిమా ఉండబోతుంది. సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. వచ్చే సంవత్సరం మార్చ్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో సన్నీ సంస్కారి తులసి కుమారి అనే సినిమాతో రాబోతుంది.

Also Read : OG Success Meet : నేడే పవర్ స్టార్ OG సక్సెస్ మీట్.. ఎప్పుడు? ఎక్కడ? పండగ ముందు ఫ్యాన్స్ కి పవన్ ట్రీట్..

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ పెద్ది సినిమా గురించి, బుచ్చిబాబు, రామ్ చరణ్ గురించి మాట్లాడింది.

జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. పెద్ది సినిమాలో నా క్యారెక్టర్ బ్లాస్ట్ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. బుచ్చిబాబు అంతకుముందు చేసిన ఉప్పెన సూపర్ సినిమా. రూటెడ్ డైరెక్టర్ అతను. అతనికి ఒక విజన్ ఉంది. అతను నాకు రాసిన పాత్ర సింపుల్ ఒక హీరోయిన్ లాగా మాత్రమే ఉండదు. ఆయన మనకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. ఆ సెట్లో ఉండటం నా అదృష్టం. ఐ లవ్ రామ్ సర్. ఆయన ఒక జెంటిల్ మెన్. ఆయనకు సూపర్ ఎనర్జీ ఉంటుంది. చాలా సిన్సియర్. ఆయన పెద్ద స్టార్ కానీ స్టూడెంట్ లా సెట్ కి వస్తారు. ఆ సెట్ కి మళ్ళీ షూటింగ్ కి వెళ్ళడానికి ఎదురుచూస్తున్నాను అని తెలిపింది. దీంతో చరణ్ ఫ్యాన్స్ జాన్వీ కామెంట్స్ ని వైరల్ చేస్తున్నారు.

Also See : Wamiqa Gabbi : గూడచారి 2 హీరోయిన్.. వామికా గబ్బి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..