Janhvi Kapoor: ఆఫర్లు వచ్చినా తెలుగుపై ఆసక్తి చూపని జాన్వీ?
శ్రీదేవి.. ఆమె అందం అమోఘం. ఆమె నటన అద్భుతం. ఆమె లేకున్నా ఇప్పటికి ఆమె గురించి మాట్లాడుతున్నాం అంటే అది ఆమె గొప్పతనం. శ్రీదేవి సినిమాల్లోనూ, బయట కూడా ఎంతో పద్దతిగా ఉండేవారు.
- Naresh Mannam
- Published On : February 22, 2022 / 06:42 PM IST
Janhvi Kapoor (image:instagram)
Janhvi Kapoor: శ్రీదేవి.. ఆమె అందం అమోఘం. ఆమె నటన అద్భుతం. ఆమె లేకున్నా ఇప్పటికి ఆమె గురించి మాట్లాడుతున్నాం అంటే అది ఆమె గొప్పతనం. శ్రీదేవి సినిమాల్లోనూ, బయట కూడా ఎంతో పద్దతిగా ఉండేవారు. శ్రీదేవి మరణించాక ఆమె వారసురాలిగా కూతురు జాన్వీ తెరంగ్రేటం చేసింది. అతిలోక సుందరి వారసురాలిగా వెండి తెరని ఏలేందుకు తహతహలాడుతున్న ఈ చిన్నది అందుకు ఏ అవకాశం వచ్చినా వదలకుండా సోకుల గాలమేసి కుర్రాళ్ళ హృదయాలలో తిష్టవేసి కూర్చుంటుంది.
Janhvi Kapoor: జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్.. రౌడీ హీరోతో రెడీ!
‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైన ఈ సుందరి ప్రస్తుతం బాలీవుడ్ లో కమర్షియల్ బ్రేక్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే.. తెలుగులో కూడా జాన్వీ నటించాలని కోరుకొనే శ్రీదేవి అభిమానులు ఎందరో ఉన్నారు. నాలుగైదేళ్లుగా ఇదో జాన్వీ వస్తుంది అంటూ రూమర్లు రావడమే తప్ప టాలీవుడ్ సినిమాలో మాత్రం జాన్వీ కనిపించడం లేదు. ఒకపక్క బాలీవుడ్ హీరోయిన్లు అంతా తెలుగు స్టార్ హీరోల సినిమాలలో నటించేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా జాన్వీ మాత్రం టాలీవుడ్ మీద ఆసక్తి లేదని రూమర్లు వినిపిస్తున్నాయి.
Janhvi Kapoor: డ్రెస్ ఏదైనా దాగనంటున్న జాహ్నవి ఉప్పొంగే అందాలు!
శ్రీదేవి వారసురాలిగా.. తండ్రి బోణీ కపూర్ సౌత్ సినిమాల నిర్మాతగా ఉండగా జాన్వీకి సౌత్ లో స్టార్ హీరో సినిమా ఛాన్స్ పెద్ద కష్టమేమీ కాదు. అయితే.. అసలు సౌత్ నిర్మాతలపైనే జాన్వీ ఆసక్తి చూపడం లేదని టాక్ ఒకటి నడుస్తుంది. తాజాగా బోయపాటి దర్శకత్వంలో హీరో రామ్ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ముహూర్తం షూట్ మొదలు పెట్టిన ఈ సినిమా కోసం మేకర్స్ ముందుగా జాన్వీ కపూర్ ను సంప్రదించారని.. కానీ తన నుండి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతోనే మేకర్స్ పరిణీతి చోప్రాను కన్ఫర్మ్ చేసుకున్నారని టాక్ నడుస్తుంది.
