Jani Master : నేను వైఎస్ జగన్ అభిమానిని.. పవన్ వీరాభిమాని జానీ మాస్టర్ కామెంట్స్..
పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా అందరికి బాగా గుర్తుకు ఉండే డాన్స్ మాస్టర్ జానీ.. తాను వైఎస్ జగన్ అభిమానిని అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో..
- gum 95921
- Published On : December 28, 2023 / 07:23 PM IST
Jani Master commented he is a fan of YS Jagan Mohan Reddy
Jani Master : టాలీవుడ్ లో డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్న ‘జానీ మాస్టర్’.. తెలుగు టెలివిజన్ షోలు ద్వారా మంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫేమ్ నే అందుకున్నారు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఆయన అందరికి బాగా గుర్తుకు ఉంటారు. అలాంటిది ఆయన వైఎస్ జగన్ అభిమానిని అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు కి చెందిన జానీ మాస్టర్.. ప్రస్తుతం అక్కడ జనసేన ప్రచారంలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. కాగా రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చారు. ఆయనని మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు అని మీడియా వారు ప్రశ్నించారు. దానికి జానీ మాస్టర్ బదులిస్తూ.. “నేను ఎవరికి మద్దతు ఇస్తున్నాను అనేది తరువాత తెలియజేస్తాను” అని చెప్పుకొచ్చారు.
Also read : Salaar : సీక్రెట్‌గా సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫీల్ అవుతున్న ప్రభాస్ అభిమానులు..
ఇంతలో మరో మీడియా పర్సన్ ప్రశ్నిస్తూ.. “మీరు జగన్ అభిమాని అని చెబుతున్నారు. కానీ జనసేన తరుపున తిరుగుతున్నారు ఏంటి..?” అని క్యూస్షన్ చేశారు. దీనికి జానీ మాస్టర్ బదులిస్తూ.. “నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను వినండి సార్. రామ్ గోపాల్ వర్మ గారికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో, జానీ మాస్టర్ కి జగన్ గారు అంటే అంత ఇష్టం” అంటూ వ్యాఖ్యానించారు.
ఇక వ్యాఖ్యలకు రియాక్ట్ అవుతూ మీడియా వాళ్ళు ఇలా ప్రశ్నించారు.. “వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారా..?”. ఆ ప్రశ్నకు జానీ మాస్టర్ బదులిస్తూ.. “ముందు ఏం జరుగుతుంది అనేది నేను తరువాత చెబుతాను” అంటూ బదులిచ్చి ముగించేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే జానీ మాస్టర్ మాటలు సరదాగా, వ్యంగ్యంగా మాట్లాడారని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
??@PawanKalyan @YSRCParty @ysjagan pic.twitter.com/Tgh40MtxZY
— Prasannakumar Nalle (@PrasannaNalle) December 28, 2023
