Jani Master Mother : హాస్పిటల్లో జానీ మాస్టర్ తల్లి.. ఈ పాపం ఊరికే పోదు అంటూ జానీ భార్య సంచలన పోస్ట్..

నిన్న జానీ మాస్టర్ తల్లి నిన్న గుండెపోటుతో హాస్పిటల్ లో చేరారు. తాజాగా ఈ సంఘటన పై జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా స్పందిస్తూ జానీ మాస్టర్ అకౌంట్ నుంచే ఓ పోస్ట్ పెట్టింది.

Jani Master Wife Sensational Post on Jani Master Mother Heart Attack

Jani Master Mother : జానీ మాస్టర్ ఇటీవల ఓ మహిళా కొరియోగ్రాఫర్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జానీ మాస్టర్ భార్య అవన్నీ అబద్దాలు అని ఆ మహిళా కొరియాగ్రాఫర్ పై సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ జైల్లో ఉన్నారు.

అయితే నిన్న జానీ మాస్టర్ తల్లి నిన్న గుండెపోటుతో హాస్పిటల్ లో చేరారు. తాజాగా ఈ సంఘటన పై జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా స్పందిస్తూ జానీ మాస్టర్ అకౌంట్ నుంచే ఓ పోస్ట్ పెట్టింది.

Also Read : Jani Master Wife : జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్.. లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ భార్య ఫిర్యాదు.. డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి..

హాస్పిటల్లో బెడ్ పై ఉన్న జానీ మాస్టర్ తల్లి వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నేషనల్ అవార్డు గురించి, కేసు గురించి నచ్చినట్టు రాస్తూ, నిజాలు నిర్ధారణవ్వకుండా, ఆరోపణల వెనుక అసలు ఉద్దేశమేంటో తెలుసుకోకుండా, కోర్టులో విచారణ జరుగుతుండగా తన కొడుకు గురించి ఎవరికి తోచింది వారు రాస్తూ, వినిపిస్తూ, చూపిస్తూ ఉండడంతో జానీ మాస్టర్ గారి అమ్మ గారు తీవ్ర మనస్తాపం చెంది గుండెపోటు వల్ల ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగానే ఉంది. అందరికీ కుటుంబాలు ఉంటాయి, ఈ పాపం ఊరికే పోదు అసలు విషయాలు త్వరలోనే బయటికొస్తాయి అంటూ సంచలన పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.