Jani Master Wife : జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్.. లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ భార్య ఫిర్యాదు.. డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి..

తాజాగా జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా ఆ మహిళా కొరియోగ్రాఫర్ పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేసింది.

Jani Master Wife : జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్.. లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ భార్య ఫిర్యాదు.. డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి..

Jani Master Wife Complaint on Lady Choreographer in Film Chamber New Twist in Case

Updated On : September 28, 2024 / 11:18 AM IST

Jani Master Wife : జానీ మాస్టర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు గాను పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసారు. ఇప్పటికే కస్టడీలో జానీ మాస్టర్ అవన్నీ ఆరోపణలు అని తనే నన్ను బెదిరించింది తెలిపాడు. తాజాగా జానీ మాస్టర్ భార్య ఆ మహిళా కొరియోగ్రాఫర్ పై సంచలన ఆరోపణలు చేసింది.

తాజాగా జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా ఆ మహిళా కొరియోగ్రాఫర్ పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేసింది.

Also Read : Jani Master : ఆ అమ్మాయిపై డైరెక్టర్ సుకుమార్ కి కంప్లైంట్ చేశాను.. కస్టడీలో జానీ మాస్టర్ కీలక విషయాలు..

ఈ ఫిర్యాదులో.. ఆ యువతి కొరియోగ్రాఫర్ గా పని చేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసింది. అయిదేళ్లుగా నరకం అంటే ఏంటో నాకు చూపించింది. నేను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లింది. నన్ను పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. నా భర్త జానీ మాస్టర్ ను ఇంటికి రాకుండా అడ్డుకునేది. రోజుకు కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది. ఆమె ఇంటికి నేను వెళ్లి జానీ మాస్టర్ ను నువ్వు ఇష్టపడితే చెప్పు ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతాను అన్నాను. కానీ ఆమె మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు, మీరు నాకు వదిన అంటూ నమ్మించింది. నా భర్తతో కాకుండా మరికొంతమందితో ఆమెకు సంబంధం ఉంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడు. దీంతో ఆమె కక్ష కట్టి తన పైన లైంగిక దాడి చేశాడు అంటూ అక్రమ కేసు పెట్టింది. పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురిచేస్తుంది. ఆమెతో పాటు ఆమె తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసింది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు, నా పిల్లలకు ఏం జరిగినా ఆ తల్లి కూతుళ్ళదే బాధ్యత. నాకు, నా పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నాను అని తెలిపింది. దీంతో ప్రస్తుతం జానీ మాస్టర్ భార్య చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.