Jani Master : ఆ అమ్మాయిపై డైరెక్టర్ సుకుమార్ కి కంప్లైంట్ చేశాను.. కస్టడీలో జానీ మాస్టర్ కీలక విషయాలు..

జానీ మాస్టర్ మరో కీలక విషయం తెలిపారు.

Jani Master : ఆ అమ్మాయిపై డైరెక్టర్ సుకుమార్ కి కంప్లైంట్ చేశాను.. కస్టడీలో జానీ మాస్టర్ కీలక విషయాలు..

Jani Master Comments on Director Sukumar in Police Custody in Choreographer case

Updated On : September 28, 2024 / 10:15 AM IST

Jani Master : ఇటీవల ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగికంగా వేధించాడని, మతం మార్చుకొని పెళ్లి చేసుకొమ్మని బలవంతపెట్టాడని ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జానీ మాస్టర్ ఈ కేసులో అరెస్ట్ అయి జైలు లో ఉన్నారు. పోలీసులు జానీ మాస్టర్ ని కస్టడీలోకి తీసుకొని విచారించగా జానీ మాస్టర్ కీలక విషయాలు వెల్లడించారు.

పోలీసుల కస్టడీలో జానీ మాస్టర్.. తనపై ఆ అమ్మాయి చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి అని, ఢీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుందని, మైనర్ గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధమని తెలిపారు. అలాగే తన టాలెంట్ ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చాను, తనని పెళ్లి చేసుకోవాలని మానసికంగా నేను హింసించలేదని, ఎన్నోసార్లు తనే నన్ను బెదిరింపులకు గురిచేసిందని తెలిపారు.

Also Read : Sathyam Sundaram : ‘సత్యం సుందరం’ రివ్యూ.. పేరు తెలియని వ్యక్తితో రాత్రంతా..

అలాగే జానీ మాస్టర్ మరో కీలక విషయం తెలిపారు. కస్టడీలో జానీ మాస్టర్.. నేను పడుతున్న ఇబ్బందిపై డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్ళానని, సుకుమార్ పిలిచి మాట్లాడినా కూడా ఆమెలో మార్పు రాలేదని, నాపై కుట్ర జరిగింది, వెనున ఉండి నాపై కుట్ర చేశారని, నా ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించారని తెలిపారు జానీ మాస్టర్.

నేటితో జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ పూర్తి కానుండగా నేడు కోర్టులో జానీ మాస్టర్ ని హాజరుపరచనున్నారు పోలీసులు. లైంగిక వేధింపుల కేసులో మూడురోజుల పాటు జానీ మాస్టర్ ని పోలీసులు విచారించారు. అయితే తాజాగా కస్టడిలో జానీ మాస్టర్ సుకుమార్ పేరు ప్రస్తావించడంతో ఈ కేసు మరింత సంచలనంగా మరింది.