Jaragandi song release from Ram Charan Game Changer movie
Game Changer : రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం.. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉంది. ఇక ఈ సినిమా నుంచి గత రామ్ చరణ్ బర్త్ డే నాడు టైటిల్ అనౌన్స్‌మెంట్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఆ తరువాత మళ్ళీ మరో అప్డేట్ లేదు. మళ్ళీ ఏడాది తరువాత రామ్ చరణ్ పుట్టినరోజున నాడే మరో అప్డేట్ ని తీసుకు వస్తున్నారు.
గత ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తామంటూ ప్రకటించి పోస్టుపోన్ చేసిన ‘జరగండి’ సాంగ్ ని ఇప్పుడు పుట్టినరోజు కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. థమన్ సంగీతం అందించిన ఈ పాటని అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా, డాలర్ మెహెన్ది, సునిధి చౌహన్ పాట పాడారు. ప్రభుదేవా డాన్స్ కోరియోగ్రఫీ చేసారు. రామ్ చరణ్ అండ్ కియారా తమ స్క్రీన్ ప్రేజేన్స్ తో అదుర్స్ అనిపించారు. ఇక శంకర్ స్టాండర్డ్ విజన్ లో ఈ సాంగ్ ని గ్రాండ్ గా రూపొందించారు. మరి ఆ గ్రాండియర్ సాంగ్ ఏ రేంజ్ లో ఉందో మీరే చూసేయండి.
Also read : Ram Charan Birthday : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు