Jathara : భయపెట్టించే ‘జాతర’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..

తాజాగా జాతర సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.

Jathara Movie First Look Poster Released

Jathara : ఇటీవల దర్శకులు కూడా హీరోలుగా మారుతున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ సతీష్ బాబు హీరోగా మారి ఓ కంటెంట్ సినిమాతో రా అండ్ రస్టిక్ గా రాబోతున్నాడు. ఈ సినిమాకు ‘జాతర’ అనే టైటిల్ ప్రకటించి తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ‘జాతర’ సినిమాకి కథ రాసుకొని డైరెక్షన్ చేయడమే కాక తనే హీరోగా నటిస్తున్నాడు సతీష్ బాబు. ఈ సినిమాని గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Also Read : Ravi Teja: రవితేజనూ వదలట్లేదు.. ఎందుకిలా చేస్తున్నారు?

ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే భయపెట్టే విధంగా ఉంది. హీరో చేతిలో కత్తులు పట్టుకొని జాతర వేషంలో, వెనక అమ్మవారి ఫోటోతో భయానకంగానే ఉంది. ఈ పోస్టర్ పై ‘దేవుడు ఆడే జగన్నాటకంలో.. ఆ దేవునితో మనిషి ఆడించే పితలాటకం’ అంటూ ఆసక్తికర డైలాగ్ రాశారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

ఈ జాతర సినిమాని చిత్తూరు జిల్లాలో జరిగే పాలేటి గంగమ్మ జాతర దేవత బ్యాక్ డ్రాప్‌ లో రాసుకున్నారు. ఇక ఈ సినిమాలో దీయా రాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా RK పిన్నపాల, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు