సైఫ్ అలీ ఖాన్, టబు, అలియా ఎఫ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న‘జవానీ జానేమన్’ ప్రేమికుల దినోత్సవ కానుకగా 2020 ఫిబ్రవరి 7న విడుదల కానుంది..
సైఫ్ అలీ ఖాన్, టబు, అలియా ఎఫ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘జవానీ జానేమన్’.. నితిన్ కక్కర్ దర్శకత్వంలో, బ్లాక్ నైట్ ఫిల్మ్స్, నార్తర్న్ లైట్స్ ఫిల్మ్స్, పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాతో పూజాబేడి కూతురు అలియా ఎఫ్ బాలీవుడ్‌కి పరిచయమవుతుంది.
తండ్రీకూతుళ్ల అనుబంధం ఆధారంగా తెరకెక్కుతున్న ‘జవానీ జానేమన్’లో అలియా, సైఫ్ కూతురిగా నటిస్తోంది. అమర్ ఖన్నాగా సైఫ్, జయా బక్షిగా టబు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ప్రేమికుల దినోత్సవ కానుకగా 2020 ఫిబ్రవరి 7న ‘జవానీ జానేమన్’ విడుదల కానుంది.
Read Also : కమల్ కాలికి సర్జరీ – అధికారికంగా ప్రకటించిన ఎంఎన్‌ఎం ఉపాధ్యక్షుడు
సైఫ్ నిర్మాణంలో కూడా భాగస్వామ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ‘జవానీ జానేమన్’ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. కుబ్రా సైత్, చుంకీ పాండే తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు బినోద్ ప్రధాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.