Jayam Ravi : విడాకులు వచ్చేవరకు నటించను.. నాపై చేతబడి చేసి చంపాలని చూశారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన జయం రవి..

జయం రవి ప్రెస్ మీట్ పెట్టి తన భార్య ఆర్తి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. (Jayam Ravi)

  • Updated on- May 16, 2026 / 05:43 PM IST

ayam Ravi Gets Emotional While Tells About His Wife Creating Problems

Jayam Ravi : తమిళ్ స్టార్ హీరో జయం రవి ఆమె భార్య ఆర్తి విడిపోతున్నట్టు 2024 లోనే ప్రకటించారు. ఆ సమయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వీరి విడాకుల అంశం సంచలనంగా మారింది. తన భార్య డబ్బుల తన డబ్బులు మొత్తం తీసేసుకుంది, తన పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టిందని, పిల్లలను దూరం చేసిందని అప్పట్లో సంచలన ఆరోపణలు చేసాడు జయం రవి. ఆర్తి కూడా రవి వేరే అమ్మాయితో ఉంటున్నాడు అని ఆరోపణలు చేసింది.

వీరిద్దరూ ప్రస్తుతం విడిగానే ఉంటున్నారు. కేసు కోర్టులోనడుస్తుంది. భార్యతో విడిపోయాక రవి సింగర్ కెనిషాతో ప్రేమలో ఉన్నాడు. అయితే నేడు కెనిషా తనపై వస్తున్న ట్రోలింగ్ తట్టుకోలేక రవి లాంటి మంచి వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటూ పోస్ట్ పెట్టడంతో జయం రవి ప్రెస్ మీట్ పెట్టి తన భార్య ఆర్తి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.

Also Read : Navakanth Master : క్రికెట్ ఫైట్ తో ఎంట్రీ.. హనుమాన్ ఎపిసోడ్.. ‘పెద్ది’ యాక్షన్ సీక్వెన్స్ లపై ఫైట్ మాస్టర్ కామెంట్స్ వైరల్..

ప్రెస్ మీట్ లో జయం రవి తన విడాకుల గురించి మాట్లాడుతూ.. ఇన్ని రోజులు నేను నా పర్సనల్ లైఫ్ గురించి మీకు చెప్పలేదు. అందుకు క్షమించండి. విడాకులు వచ్చే వరకూ ఇక నా సినిమాలు రిలీజ్ కావు. అప్పటిదాకా నేను నటించను కూడా. నన్ను ఇబ్బంది పెట్టాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను నటించలేను. 14 ఏళ్ల నా పెళ్లి జీవితంలో నేను ఒక బానిసలా బతికాను. కష్టపడి సంపాదించిన కోట్ల రూపాయలను, నా ఆస్తులను నా భార్య వైపు వాళ్లే ఉంచుకున్నారు. కనీసం నా పేరు మీద బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా చేశారు. నా ఇల్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. నా చేతిలో రూపాయి లేదు. నా ఇంట్లోంచి నేను బయటకు వచ్చేసాను. ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఎవరైనా సరే ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి. ఇకపై నేను మౌనంగా ఉండేది లేదు అని అన్నారు.

తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి స్పందిస్తూ.. ప్రస్తుతం నాపై జరుగుతున్న ట్రోలింగ్ నన్ను చాలా బాధపెట్టింది. నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా. 95 శాతం సినిమాలు హిట్‌ అయ్యాయి. 45ఏళ్ల వయసులో నాకు అమ్మాయిల వెనక పడాల్సిన అవసరం లేదు. మహిళల హక్కుల కోసం చాలా పోరాటాలు చేశాను. అలాంటిది నాపై నిందలు వేస్తున్నారు. నన్ను అర్ధం చేసుకొని నాకు తోడుగా నిలిచిన కెనిషాని వెళ్లిపోయేలా చేశారు. నా పిల్లల భవిష్యత్ బాగుండాలని లక్షలు ఖర్చుపెట్టి చదివించాను. వాళ్ల కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉంటూ వచ్చాను. కానీ నా పిల్లలకు కూడా నన్ను దూరం చేశారు అని అన్నారు.

Also Read : Chiru Leaks: ‘పెద్ది’ ట్రైలర్ పై చిరు లీక్స్.. దానికి మించి అంటూ మెగాస్టార్ ట్వీట్ వైరల్..

తనపై చేతబడి కూడా చేశారని చెప్తూ.. నేను వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఉండటానికి నాపై చేతబడి చేశారు. నన్ను పూర్తిగా నాశనం చేయడానికి ఇలా చేశారు. ఆ చేతబడి వల్ల నాకు రక్తంతో వాంతులు అవుతున్నాయి. శారీరకంగా, మానసికంగా నన్ను హింసించి చంపేయాలని కుట్ర చేస్తున్నారు. అయినా నేను వదలకుండా పోరాడతాను అని ఎమోషనల్ అయ్యారు. దీంతో జయం రవి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి దీనిపై ఆర్తి స్పందిస్తుందా లేదా చూడాలి.