×
Ad

Jeevitha Rajashekar : మా ఆయన, నా కూతుళ్లే సర్వస్వం.. వాళ్ళ కోసం ఎవరితో ఎంత పెద్ద ఫైట్ అయినా చేస్తా..

ఈ సినిమా ట్రైలర్ లో రాజశేఖర్.. నేను జీవిత చెప్పేది తప్ప ఇంకెవరు చెప్పినా వినను. నాకు జీవితం, జీవిత రెండూ ఒకటే అనే డైలాగ్ బాగా వైరల్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజశేఖర్, జీవిత సరదాగా దీని గురించి మాట్లాడారు. అనంతరం జీవిత తన ఫ్యామిలీ గురించి మాట్లాడింది.

  • Published On : December 5, 2023 / 09:35 AM IST

Jeevitha Rajashekar speaks about her Husband Rajashekar and her Family in Extra Ordinary Man Pre Release event

Jeevitha Rajashekar : రైటర్ వక్కంతం వంశీ దర్శకుడిగా నితిన్(Nithiin), శ్రీలీల(Sreeleela) జంటగా తెరకెక్కించిన సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’(Extra Ordinary Man). ఈ సినిమాలో హీరో రాజశేఖర్ ముఖ్య పాత్ర చేయడం విశేషం. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పలు సాంగ్స్ రిలీజ్ చేయగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నిన్న హైదరాబాద్ లో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు.

ఈ ఈవెంట్లో రాజశేఖర్, జీవిత కూడా పాల్గొన్నారు. ఈ సినిమా ట్రైలర్ లో రాజశేఖర్.. నేను జీవిత చెప్పేది తప్ప ఇంకెవరు చెప్పినా వినను. నాకు జీవితం, జీవిత రెండూ ఒకటే అనే డైలాగ్ బాగా వైరల్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజశేఖర్, జీవిత సరదాగా దీని గురించి మాట్లాడారు. అనంతరం జీవిత తన ఫ్యామిలీ గురించి మాట్లాడింది.

జీవిత మాట్లాడుతూ.. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఒకరి మాట ఒకరు వినాలి. ఒకరి కష్టం ఒకరు షేర్ చేసుకోవాలి, ఒకరి కోసం ఒకరు బతకాలి. కలిసి నడవాలి. అలా ఉంటేనే పెళ్లిళ్లు చేసుకోవాలి. నా జీవితంలో అదే జరిగింది. మేము సంతోషంగా ఉన్నాం. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. నాకు మా ఆయన, నా ఇద్దరు కూతుళ్లే సర్వస్వం. వాళ్ళ కోసం ఎంత పెద్ద ఫైట్ అయినా చేస్తా, ఎవర్నైనా ఎదురిస్తా అని అన్నారు. దీంతో జీవిత చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Sreeleela : వామ్మో శ్రీలీల స్టేట్ లెవెల్ లో ఇన్ని గేమ్స్ ఆడిందా? ఇన్ని ట్యాలెంట్స్ ఉన్నాయా శ్రీలీలలో..

అలాగే.. నితిన్ నాన్న సుధాకర్ రెడ్డి మా ఆయన ‘మగాడు’ సినిమాతోనే డిస్ట్రిబ్యూటర్ గా మారారు. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మొదటిసారి స్పెషల్ క్యారెక్టర్ కూడా ఆయన నిర్మాణంలో చేయడం చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర్ గారిని స్పెషల్ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్ చేయరు అనుకుంటారు. కానీ మంచి క్యారెక్టర్ వస్తే చేస్తారు. ఆయనకు కొత్త కొత్త క్యారెక్టర్స్ చేయడం చాలా ఇష్టం. నితిన్ రాజశేఖర్ గారిని ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. ఎందుకంటే ఆయన ఉన్న సీన్స్ లో రాజశేఖర్ గారు ఎక్కువగా కనిపిస్తారు. శ్రీలీల నా కూతురు లాంటిది అని అన్నారు.