ఖాకీ యూనిఫామ్‌లో ఝాన్సీ.. వికారాబాద్‌లో రకుల్

  • Published By: sekhar ,Published On : September 21, 2020 / 03:00 PM IST
ఖాకీ యూనిఫామ్‌లో ఝాన్సీ.. వికారాబాద్‌లో రకుల్

Updated On : September 21, 2020 / 3:46 PM IST

Anchor Jhansi – Rakul Preet Singh: యాంకర్‌గా, నటిగా బుల్లితెరతో పాటు వెండితెర మీద కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఝాన్సీ. ఇన్ని రోజులు లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఝాన్సీ ఇకపై వరుస సినిమాలతో బిజీ కానుంది. త్వరలో పోలీసాఫీసర్ పాత్రలో కూడా కనిపించనుందామె.  రీసెంట్‌గా ఖాకీ యూనిఫామ్‌లో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఝాన్సీ.


Actor’s life …! Various roles in uniform…!
Miss you cinema …! Come back to full swing soon ..!#tollywood #telugucinema
#actorslife అంటూ సదరు పిక్స్ పోస్ట్ చేసింది ఝాన్సీ.


టాలీవుడ్ ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ మీడియా అండ్ సోషల్ మీడియాలో ఈమధ్య బాగా వినిపించింది. డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న హీరోయిన్ రియా చక్రవర్తి.. రకుల్ పేరును వెల్లడించినట్టు వార్తలు రావడంతో రకుల్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లి హైకోర్టును ఆశ్రయించగా.. రకుల్‌కు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.


దీంతో రకుల్ తిరిగి హైదరాబాద్ వచ్చి షూటింగ్‌లో పాల్గొంటోంది. క్రిష్ డైరెక్షన్‌లో మెగా హీరో వైష్ణవ్ తేజ హీరోగా రూపొందుతున్న సినిమాలో రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ అటవీ ప్రాంతంలో జరుగుతోంది. అక్టోబర్ నెలాఖరుకల్లా గుమ్మడికాయ కొట్టనున్నారు.

https://www.instagram.com/p/CFYpYdqsCzt/?utm_source=ig_web_copy_link