Danam Nagender: పెద్ద ప్లానే..! సడెన్‌గా దానం నాగేందర్ యూటర్న్.. కారణం అదేనా?
మొన్నటి వరకు బైపోల్‌కు సై అని..ఎప్పుడంటే అప్పుడు రాజీనామా చేస్తానన్న దానం..సడెన్‌గా యూటర్న్ తీసుకోవడం వెనుక మరో కారణం ఉందన్న చర్చ జరుగుతోంది.
Danam Nagender Representative Image (Image Credit To Original Source)
- దానం నాగేందర్ యూటర్న్ ఎందుకు తీసుకున్నట్లు?
- ఇప్పటికిప్పుడు వేటు నుంచి తప్పించుకునే స్కెచ్చా?
- కాలయాపన కోసమే దానం టోన్ మార్చేశారా?
- ఉప ఎన్నిక వస్తే ఓడిపోతామనే టెన్షన్ పట్టుకుందా?
Danam Nagender: మిగతా వాళ్ల సంగతి తెల్వదు. తాను మాత్రం కాంగ్రెస్‌లోనే ఉన్నానన్నారు. సీఎం రేవంత్ ఎప్పుడు చెప్తే అప్పుడు రాజీనామా చేస్తానన్నారు. కట్ చేస్తే ఇప్పుడు తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే..ఆ పార్టీకి రాజీనామానే చేయలేదంటున్నారు. బీఆర్ఎస్ కూడా తనను ఇప్పటివరకు సస్పెండ్ చేయలేదంటున్నారు. సడెన్‌గా దానం ఎందుకు యూటర్న్ తీసుకున్నట్లు? ఓపెన్ స్టేట్ మెంట్ అలా ఇచ్చిన దానం.. అఫిడవిట్ ఇలా ఎందుకు వేసినట్లు? దానం బ్యాక్ స్టెప్ వేయడం వెనక ప్లానేంటి? బైపోల్ భయమా ? రాజకీయ పరిస్థితుల ప్రభావమా?
తెలంగాణ పాలిటిక్స్‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా..వారిలో ఇప్పటికే ఏడుగురికి క్లీన్ చిట్ వచ్చేంది. ఇక మిగిలిన కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్, దానం నాగేందర్ ల భవితవ్యం తేలాల్సి ఉంది. ఇందులోనూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇష్యూ వెరీ స్పెషల్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ బీ ఫామ్‌పై ఏకంగా ఎంపీగా పోటీ చేసి ఓడిన వ్యక్తి దానం నాగేందర్. గతంలో రెండు సార్లు స్పీకర్ నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్‌గా అఫిడవిట్ దాఖలు చేశారు.
అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి..
క్రాస్ ఎగ్జామింగ్కు అటెండ్ కావాలని స్పీకర్ నోటీసులు ఇస్తే..ఏకంగా తనపై వచ్చిన ఫిర్యాదుల కేసును డిస్మిస్ చేయాలంటూ కౌంటర్ దాఖలు చేయడం ఆసక్తిరేపుతోంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేనని బహిరంగంగా చెప్పిన దానం..ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనేనంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. అంతేకాదు తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేసి కొత్త చర్చకు తెరలేపారు. తాను BRSకు రాజీనామా చేయలేదంటున్న దానం..సేమ్‌టైమ్ BRS కూడా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదంటూ కొత్త రాగం అందుకున్నారు.
కాంగ్రెస్‌లోనే ఉన్నానంటూ ఓపెన్ స్టేట్ మెంట్లు..
2024 మార్చిలో వ్యక్తిగత హోదాలో మాత్రమే కాంగ్రెస్ సమావేశానికి వెళ్లినట్లు చెప్పుకొస్తున్నారు. బీఆర్ఎస్ యాక్షన్ ను బట్టి తన రియాక్షన్ ఉంటుందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. పది మంది ఎమ్మెల్యేల్లో ఎవరి సంగతి ఎలా ఉన్నా.. దానంపై వేటు పడటం ఖాయమని..అంతకంటే ముందే ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానంటూ దానం ఓపెన్ స్టేట్ మెంట్లు కూడా గతంలో ఇచ్చారు. మిగిలిన 9 మంది తాము కాంగ్రెస్‌లో ఉన్నామో, బీఆర్ఎస్లో ఉన్నామో తెలియకుండా దాటవేస్తూ తప్పించుకు తిరిగినా..దానం మాత్రం ఓపెన్‌గానే తనది కాంగ్రెస్ అని చెప్తూ వచ్చారు. కానీ సడెన్‌గా దానం కూడా మిగతా ఎమ్మెల్యేల స్టైల్ లోనే తనది బీఆర్ఎస్ యే అంటూ మాట్లాడుతుండటం ఇంట్రెస్టింగ్గా మారింది.
ఇప్పటికిప్పుడు ఇష్యూ నుంచి బయటపడేందుకే గేర్ మార్చారా?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇస్తున్న ట్విస్టులు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ డిబేట్‌గా మారాయి. మొన్నటి వరకు తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పుకున్న దానం..అఫిడవిట్ లో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటూ చెప్పుకొచ్చారు. దానం ఇలా రివర్స్ గేర్ వేయడం పెద్ద వ్యూహమే ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఫిరాయింపుల కేసును సుప్రీంకోర్టు చాలా సీరియస్‌గా తీసుకుని ఫాలో అప్ చేస్తుంది. కోర్టులో మరోసారి వాదనలు జరగబోతుండటంతో..ఇప్పటికిప్పుడు ఇష్యూ నుంచి బయటపడేందుకే దానం ఇలా అఫిడవిట్ దాఖలు చేశారని అంటున్నారు.
సాగదీసే ధోరణికి ఛాన్స్ ఇచ్చారా?
దానం యూటర్న్ వెనుక సాగదీసే ధోరణికి ఛాన్స్ ఇచ్చారనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు బంతి స్పీకర్ కోర్టులోకి వచ్చిన నేపథ్యంలో క్రాస్ ఎగ్జామినేషన్ జరగాల్సి ఉంటుంది కనుక..కోర్టు నుంచి మరికొంత సమయం కోరవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారనడానికి ఆధారాలు లేవని చెప్పినప్పటికి..దానం విషయంలో మాత్రం కాంగ్రెస్ బీఫామ్‌పై ఎంపీగా కంటెస్ట్ చేసినట్లు పబ్లిక్ డొమెయిన్‌లోనే ప్రూఫ్ ఉంది. ఇది బలమైన ఆధారంగా ఉండటంతో ఎస్కేప్ కాలేని పరిస్థితి. దీంతో సుప్రీంకోర్టు డెడ్‌లైన్ నుంచి ఇప్పటికిప్పుడు ఉపశమనం పొందేందుకే.. సాగదీతనే ఫైనల్ అనే ఆలోచనకు దానం వచ్చారట. అందుకే ఎవరూ ఊహించని విధంగా స్పీకర్ నోటీసులకు అఫిడవిట్ సమర్పించి కొత్త ట్విస్ట్ ఇచ్చారట.
అయితే దానం అఫిడవిట్‌పై..క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎలా వ్యవహరిస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పుడు దానం విచారణ కోసం స్పీకర్ గడువు కోరితే సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే మూడుసార్లు గడువు పెంచిన సుప్రీంకోర్టు..మరోసారి గడువు పెంచుతుందా.. లేక చర్యలకు ఆదేశిస్తుందా అనేది సస్పెన్స్‌గా మారింది.
అయితే మొన్నటి వరకు బైపోల్‌కు సై అని..ఎప్పుడంటే అప్పుడు రాజీనామా చేస్తానన్న దానం..సడెన్‌గా యూటర్న్ తీసుకోవడం వెనుక మరో కారణం ఉందన్న చర్చ జరుగుతోంది. ఖైరతాబాద్‌కు బైఎలక్షన్ వస్తే తనకు టిక్కెట్ ఇవ్వరనే టాక్ ఓవైపు.. ఇచ్చినా గెలిచే ఛాన్సే లేదని మరో టాక్ వస్తుండటంతోనే కొద్దిరోజులు కాలయాపన చేయడమే లక్ష్యంగా దానం ఇలా అఫిడవిట్ దాఖలు చేశారని తెలుస్తోంది. మున్సిపల్, గ్రేటర్ ఎన్నికలు పూర్తయిన తర్వాతే ఖైరతాబాద్ ఉపఎన్నిక తేవాలనే యోచనలో అటు కాంగ్రెస్ పెద్దలు ఉండటం వల్లే దానం యూటర్న్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: రాజకీయ పార్టీ ఏర్పాటుపై కవిత కసరత్తు స్పీడప్.. ఆ నెలలో పార్టీపై ప్రకటన? తర్వాత పాదయాత్ర..!?
