jinn trailer
Jinn Trailer : సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్స్ పై నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన సినిమా ‘జిన్’. చిన్మయ్ రామ్ దర్శకత్వంలో తెరక్కేక్కిన ఈ సినిమాలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత.. పలువురు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుండగా నేడు ట్రైలర్ రిలీజ్ చేసారు.(Jinn Trailer)
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి నిర్మాత రాజ్ కందుకూరి, డైరెక్టర్ వీరభద్రం చౌదరి, నటుడు సోహెల్ గెస్ట్ లుగా వచ్చారు. భూతనాల చెరువు, అక్కడ ఓ కాలేజీ, ఆ కాలేజీలో నలుగురు యువకులు ప్రేతాత్మలకు చిక్కడం.. లాంటి కథాంశంతో హారర్ సినిమాలా తెరకెక్కించారు. మీరు కూడా జిన్ ట్రైలర్ చూసేయండి..
Also Read : Jabardasth Abhi : ప్రభాస్ పక్కన నటిస్తే.. 11 వేలు ఇచ్చారు.. జబర్దస్త్ అభి కామెంట్స్ వైరల్..
ట్రైలర్ లాంచ్ అనంతరం నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. జిన్ టైటిల్ బాగుంది. గుడ్ జిన్, బ్యాడ్ జిన్ అని జిన్‌లో రెండు రకాలుంటాయి. హారర్ చిత్రాలకు రిస్క్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటుంది. కరెక్ట్‌గా భయపెడితే ఆడియెన్స్ హారర్ చిత్రాల్ని ఆదరిస్తారు. జిన్ సినిమా డిసెంబర్ 19న రిలీజయి పెద్ద హిట్ అవుతుంది అని అన్నారు.
ఈ సినిమా దర్శకుడు చిన్మయ్ రామ్ మాట్లాడుతూ.. మా జిన్ లో అందర్నీ సపోర్ట్ చేసి డబ్బులు పెట్టి నిర్మించిన నిఖిల్ గారికి థాంక్స్. మీరు పెట్టే డబ్బులకు సరిపడా ఎంటర్టైన్మెంట్ ఇస్తాము అని అన్నారు.
Also See : Akhanda 2 : అఖండ 2 నిర్మాతలను బాలయ్య దూరం పెట్టారా..? నిర్మాతలు వర్సెస్ బాలయ్య..?