John Cena : ఆస్కార్ వేదికపైకి నగ్నంగా వచ్చిన జాన్‌సీన..వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోలు..

ప్రతి సారి ఆస్కార్ వేడుకల్లో ఏదో ఒక విషయం హైలెట్ అవ్వాల్సిందే. ఈ సారి జాన్‌సీన చేసిన పని వైరల్ అవుతుంది.

John Cena Coming with out Dress on Oscar Stage Photos videos goes Viral

John Cena : నేడు 96వ ఆస్కార్(Oscar) వేడుకలు లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరిగాయి. ఈ సారి అవార్డుల్లో ఓపెన్ హైమర్, పూర్ థింగ్స్ సినిమాలు ఎక్కువ అవార్డులు గెలుచుకున్నాయి. ప్రతి సారి ఆస్కార్ వేడుకల్లో ఏదో ఒక విషయం హైలెట్ అవ్వాల్సిందే. ఈ సారి జాన్‌సీన చేసిన పని వైరల్ అవుతుంది.

పాపులర్ అమెరికన్ రెజ్లర్, WWE ఫేమ్ జాన్‌సీనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇండియాలో కూడా జాన్‌సీనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జాన్‌సీన కూడా నటుడిగా కొన్ని యాక్షన్ సినిమాల్లో నటించాడు. నేడు జరిగిన ఆస్కార్ వేడుకలకు జాన్‌సీన కూడా వచ్చాడు. అయితే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డుని ప్రకటించడానికి జాన్‌సీనని వేదికపైకి ఆహ్వానించారు.

దీంతో జాన్‌సీన ఒంటిమీద ఏమి లేకుండా నగ్నంగా కేవలం ముందు వైపు ప్రైవేట్ పార్ట్ వద్ద ఓ అట్టముక్క అడ్డం పెట్టుకొని స్టేజిపైకి వచ్చాడు. మొదట జాన్‌సీనను ఇలా చూసి అంతా షాక్ అయ్యారు. అనంతరం జాన్‌సీన మైక్ వద్దకు వచ్చి కాస్ట్యూమ్స్ అందుకే ఇంపార్టెంట్ అని చెప్పడంతో అందరూ నవ్వేశారు. వెంటనే కొంతమంది వచ్చి జాన్‌సీనకు చీరలా చుట్టుకునే కాస్ట్యూమ్ ఒకటి స్టేజిపైనే వేశారు. అనంతరం జాన్‌సీన బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డుని ప్రకటించారు. ఈ సారి బెస్ట్ కాస్టూమ్‌ డిజైన్‌ అవార్డు పూర్ థింగ్స్‌ సినిమాకు హోలి వెడ్డింగ్‌టన్‌ అందుకున్నారు.

Also Read : RRR Movie : ఆస్కార్ వేదికపై మరోసారి RRR సినిమా.. చరణ్, ఎన్టీఆర్ హవా..

ఇలా ఆస్కార్ వేదికపైకి జాన్‌సీన నగ్నంగా రావడం, అక్కడే డ్రెస్ వేసుకోవడంతో జాన్‌సీన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ఆస్కార్ వాళ్ళే ఇలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారట. కానీ ఇది మరీ కొంచెం ఓవర్ అయినట్టు ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.