RRR Movie : ఆస్కార్ వేదికపై మరోసారి RRR సినిమా.. చరణ్, ఎన్టీఆర్ హవా..

RRR ఇచ్చిన హైప్ ఆస్కార్ వేదిక ఇంకా మరువలేదు. దీంతో ఈసారి ఇండియా నుంచి ఏ సినిమా లేకపోయినా RRR ని మాత్రం తలుచుకున్నారు.

RRR Movie : ఆస్కార్ వేదికపై మరోసారి RRR సినిమా.. చరణ్, ఎన్టీఆర్ హవా..

RRR Movie appeared again on 96th Oscar Awards Stage Videos goes Viral

Updated On : March 11, 2024 / 9:20 AM IST

RRR Movie : ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న 96వ ఆస్కార్ అవార్డు(Oscar Awards) వేడుకలు నేడు ఘనంగా లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో జరిగాయి. గత సంవత్సరం ఆస్కార్ వేడుకలు ప్రపంచమంతా వైరల్ అయ్యాయి. గత సంవత్సరం ముఖ్యంగా ఇండియా అంతా మొదటిసారి ఆస్కార్ అవార్డుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసింది. ఎందుకంటే RRR సినిమా కోసం.

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన RRR సినిమా ప్రపంచమంతా ప్రశంశలు పొంది, ప్రపంచంలోని పలు అత్యున్నత సినీ అవార్డులు గెలుచుకొని ఆస్కార్ వరకు వెళ్ళింది. ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ లో మొదటి ఇండియన్ సినిమాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలిచి ప్రపంచాన్ని ఊపేసిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. మన కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ వేదికపై అవార్డు అందుకొని తెలుగు సినిమా సత్తాని చాటారు.

Also Read : Oppenheimer : ఆస్కార్ అవార్డుల్లో.. క్రిస్టోఫర్ నోలన్ ‘ఓపెన్ హైమర్’ హవా.. ఏ సినిమాలు ఎక్కువ అవార్డులు గెలిచాయంటే..

కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డు తెలుగు సినిమాకి RRR తో సాధ్యమైంది. ఆ తర్వాత చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ప్రపంచమంతా పేరు సంపాదించుకున్నారు. RRR ఇచ్చిన హైప్ ఆస్కార్ వేదిక ఇంకా మరువలేదు. దీంతో ఈసారి ఇండియా నుంచి ఏ సినిమా లేకపోయినా RRR ని మాత్రం తలుచుకున్నారు. ఆస్కార్ వేదికపై స్టంట్స్ కి సంబంధించిన ఓ స్పెషల్ వీడియో వేయగా అందులో RRR సినిమాలోని రెండు యాక్షన్ షాట్స్ ని చూపించారు. అలాగే చరణ్, ఎన్టీఆర్ కలిసి వేసిన నాటు నాటు స్టెప్పు కూడా స్టేజ్ వెనక తెరపై చూపించారు. ఈ వీడియోలను RRR సినిమా ట్విట్టర్ పేజీలో షేర్ చేయడం విశేషం. దీంతో RRR మరోసారి వైరల్ అవుతుంది. నాటు నాటు హవా నుంచి హాలీవుడ్ ఇంకా బయటకి రాలేదు, బాగా గుర్తుంచుకుంది, అలా గుర్తుండిపోతుంది అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆస్కార్ తో పాటు RRR కూడా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.