Oppenheimer : ఆస్కార్ అవార్డుల్లో.. క్రిస్టోఫర్ నోలన్ ‘ఓపెన్ హైమర్’ హవా.. ఏ సినిమాలు ఎక్కువ అవార్డులు గెలిచాయంటే..

ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో అన్నిటికంటే ఎక్కువగా ఓపెన్ హైమర్ సినిమా ఏకంగా 13 విభాగాల్లో నామినేషన్స్ సాధించింది.

Oppenheimer : ఆస్కార్ అవార్డుల్లో.. క్రిస్టోఫర్ నోలన్ ‘ఓపెన్ హైమర్’ హవా.. ఏ సినిమాలు ఎక్కువ అవార్డులు గెలిచాయంటే..

Oppenheimer Movie Winning Oscar Awards List and Other Movies with highest number awards

Oppenheimer : 96వ ఆస్కార్ వేడుకలు నేడు ఘనంగా లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో జరిగాయి. ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో అన్నిటికంటే ఎక్కువగా ఓపెన్ హైమర్ సినిమా ఏకంగా 13 విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. పూర్ థింగ్స్ 11 విభాగంలో, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ 10 విభాగాల్లో, బార్బీ 8 విభాగాల్లో నామినేషన్స్ సాధించాయి.

అయితే అవార్డుల్లో మాత్రం ఓపెన్ హైమర్ అదరగొట్టేసింది. 13 విభాగాల్లో నామినేట్ అయితే ఏకంగా 7 విభాగాల్లో ఓపెన్ హైమర్ ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్‌, బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఓపెన్ హైమర్ ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.

ఆ తర్వాత పూర్ థింగ్స్ సినిమా బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ కాస్టూమ్‌ డిజైన్‌, బెస్ట్‌ మేకప్ అండ్ హెయిర్‌ స్టయిల్‌, బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌.. నాలుగు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. బార్బీ సినిమా కేవలం బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్‌ ఒక్క విభాగంలోనే ఆస్కార్ గెలుచుకోవడం గమనార్హం. ఇక కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సినిమా 10 నామినేషన్స్ తెచ్చుకున్నా ఒక్క అవార్డు కూడా గెలుచుకోలేకపోయింది.

Also Read : Oscars 2024 Full List : 96వ ఆస్కార్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్.. దుమ్ము దులిపేసిన ఓపెన్ హైమర్, పూర్ థింగ్స్..

మొత్తానికి ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో ఓపెన్ హైమర్ సినిమా సందడి చేసింది. ఈ సినిమాకి క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) మొదటిసారి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్ అవార్డు గెలుచుకున్నాడు.