Josh Ravi : అప్పుడు రెండు వేలు ఇచ్చారు.. ఇప్పుడు రెండు లక్షలు ఇస్తా అన్నా జబర్దస్త్ కి వెళ్ళను..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా జబర్దస్త్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు జోష్ రవి.
- Saketh U
- Published On : August 18, 2023 / 10:02 AM IST
Josh Ravi sensational comments on Jabardasth show
Josh Ravi : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా జోష్ రవి అందరికి తెలుసు. పలు సినిమాల్లో మెప్పించాడు. అనంతరం జబర్దస్త్(Jabardasth) లో కూడా యాక్ట్ చేసి మెప్పించాడు. ప్రస్తుతం కేవలం సినిమాలు మాత్రమే చేస్తున్నాడు జోష్ రవి. ఇటీవలే దయ అనే వెబ్ సిరీస్ లో కనిపించాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా జబర్దస్త్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు జోష్ రవి.
జోష్ రవి మాట్లాడుతూ.. జబర్దస్త్ అంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. జబర్దస్త్ వదిలేసి వచ్చాక గెస్ట్ గా కూడా నాలుగు సార్లు వెళ్ళాను. అందులో స్కిట్స్ రెగ్యులర్ గా చేయమంటే మాత్రం చేయను ఇప్పుడు. మొదట్లో రెండు వేలు ఇచ్చేవాళ్ళు. రెండు లక్షలు ఇస్తా అన్నా నేను ఇప్పుడు జబర్దస్త్ కి వెళ్ళను. గెస్ట్ గా రమ్మంటే, లేదా ఎవరైనా స్కిట్ లో సరదాగా కనపడమంటే వెళ్తాను. నేను సినిమాలు అనుకొనే పరిశ్రమకు వచ్చాను. నా కెరీర్ సినిమాల్లోనే మొదలైంది. మధ్యలో జబర్దస్త్ వచ్చింది కదా అని వెళ్లాను. అది నా కెరీర్ కాదు. నాకు సినిమాలే మెయిన్. అందుకే నేను డబుల కోసం ఈవెంట్స్ కి కూడా వెళ్ళను. జబర్దస్త్ వాళ్లంతా ఈవెంట్స్, ఫంక్షన్స్ వెళ్లి డబ్బులు సంపాదించుకున్నారు. నేను కేవలం సినిమాలు మాత్రమే చేయాలని కూర్చున్నాను కాబట్టి సినిమాలు వస్తే చేస్తాను అంతే కానీ డబ్బుల కోసం జబర్దస్త్, ఈవెంట్స్ కి మాత్రం వెళ్ళను అని అన్నాడు.
Manchu Vishnu : 150 కోట్లతో భక్త కన్నప్ప.. మంచు విష్ణు నెక్స్ట్ సినిమా డీటెయిల్స్..
దీంతో జోష్ రవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అలాగే ఇప్పుడొచ్చేవాళ్లంతా ఎవరో కూడా నాకు తెలీదు సరిగ్గా. కానీ ఎవరైనా పిలిచి స్కిట్ లో కనపడమంటే సరదాగా వెళ్లి వస్తాను, డబ్బులు కూడా తీసుకోను అని అన్నాడు. మరి దీనిపై జబర్దస్త్ వాళ్ళు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.
