Manchu Vishnu : 150 కోట్లతో భక్త కన్నప్ప.. మంచు విష్ణు నెక్స్ట్ సినిమా డీటెయిల్స్..

తన నెక్స్ట్ సినిమా భక్త కన్నప్ప అని గతంలోనే ప్రకటించారు. తాజాగా మంచు విష్ణు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో భక్త కన్నప్ప సినిమా గురించి మాట్లాడారు.

Manchu Vishnu : 150 కోట్లతో భక్త కన్నప్ప.. మంచు విష్ణు నెక్స్ట్ సినిమా డీటెయిల్స్..

Manchu Vishnu Next Movie Bhakta Kannappa Details

Updated On : August 18, 2023 / 9:30 AM IST

Manchu Vishnu :  మంచు విష్ణు ఇటీవల అడపాదడపా సినిమాలు తీస్తున్నాడు. గత సంవత్సరం జిన్నా సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు విష్ణు. ఇక తన సినిమాల కంటే కూడా తన వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తన నెక్స్ట్ సినిమా భక్త కన్నప్ప అని గతంలోనే ప్రకటించారు. తాజాగా మంచు విష్ణు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో భక్త కన్నప్ప సినిమా గురించి మాట్లాడారు.

మంచు విష్ణు మాటాడుతూ.. నా కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా. దాదాపు 150 కోట్లు అవుతుంది. నా మార్కెట్ కి 10 రేట్లు ఎక్కువే. ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు అందుకే రిస్క్ చేస్తున్నాను. ప్రస్తుతానికి సొంత ప్రొడక్షన్ లోనే ఈ సినిమా తెరకెక్కిస్తున్నాము. తర్వాత ఎవరైనా కలిస్తే చెప్తాను. ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్ లు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో చాలా భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తాము. ఇక సినిమాలో చాలా మంది సౌత్ స్టార్స్ ఉన్నారు. త్వరలోనే మిగిలిన డీటెయిల్స్ అన్ని చెప్తాము అని తెలిపారు.

Manchu Vishnu : గొప్పగొప్పోల్లే ఓడిపోయారు.. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్, సినిమాలపై మంచు విష్ణు కామెంట్స్..

దీంతో మంచు విష్ణు మరోసారి పెద్ద రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు. గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీకి సరైన విజయాలు లేవు. మార్కెట్ కూడా తగ్గింది. అలాంటిది ఈ సమయంలో ఏకంగా 150 కోట్లతో సినిమా అంటే ఆలోచించాల్సిన విషయమే. మరి ఈ సినిమాతో విష్ణు ఏమైనా అద్భుతాలు సృష్టిస్తాడేమో చూడాలి.