Manchu Vishnu : గొప్పగొప్పోల్లే ఓడిపోయారు.. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్, సినిమాలపై మంచు విష్ణు కామెంట్స్..
తాజాగా మంచు విష్ణు ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక అంశాలపై స్పందించాడు. ఈ నేపథ్యంలో పాలిటిక్స్, సినిమాల గురించి కూడా మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ గురించి అడగడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మంచు విష్ణు.

Manchu Vishnu comments on Pawan Kalyan Politics and Movies
Manchu Vishnu : మంచు విష్ణు తన సినిమాల కంటే కూడా తన వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. మా(MAA) ఎన్నికల సమయంలో మంచు విష్ణు బాగా వైరల్ అయ్యారు. ఆ తర్వాత జిన్నా(Ginna) సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు విష్ణు. ప్రస్తుతం ఓ పక్క సినిమాలతో మరో పక్క తన బిజినెస్ లతో బిజీగానే ఉన్నారు విష్ణు. ఇక మంచు విష్ణు ఫ్యామిలీ అంతా పాలిటిక్స్ కి ఏదో ఒక రకంగా సంబంధం ఉంది. అన్ని పార్టీల్లోనూ మంచు ఫ్యామిలీకి స్నేహితులు ఉన్నారు
తాజాగా మంచు విష్ణు ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక అంశాలపై స్పందించాడు. ఈ నేపథ్యంలో పాలిటిక్స్, సినిమాల గురించి కూడా మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ గురించి అడగడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మంచు విష్ణు.
Mahesh Babu : తన పెంపుడు కుక్క చనిపోయిందని మహేష్ ఎమోషనల్ పోస్ట్..
మంచు విష్ణు మాటాడుతూ.. ఆయన పాలిటిక్స్ గురించి నేను మాట్లాడను. సినిమా పరంగా ఆయన స్టార్ హీరో. ఒక సినిమా ఆడకపోయినా ఇంకో సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఆయన ఫ్లాప్ సినిమాకు కూడా కలెక్షన్స్ వస్తాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గెలుస్తారా అంటే ఒక ఆరు నెలల తర్వాత ఏమన్నా చెప్పగలను. ఇప్పుడే చెప్పడం కష్టం. జనాలు చాలా స్మార్ట్. మన కంటే ఎక్కువ తెలివితేటలు వాళ్ళకి ఉంటాయి. ఫేవరేట్ హీరోల సినిమాలు చూస్తారు కానీ వాళ్ళకి నచ్చినవాళ్ళకి ఓట్లు వేస్తారు. సినిమాకి, పాలిటిక్స్ కి చాలా మంది ముడి పెట్టరు. రాజకీయాల్లో గొప్పగొప్పోల్లే ఓడిపోయారు. జనాలు ఎవరికి ఓటు వేస్తారో వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది అని అన్నారు. దీంతో మంచు విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి దీనిపై ఎవరైనా పవన్ అభిమానులు స్పందిస్తారేమో చూడాలి.