War 2 : ‘వార్ 2’ కోసం కాల్ షీట్స్ ఇచ్చిన ఎన్టీఆర్.. హృతిక్‌తో సీన్స్ కోసం..

'వార్ 2' కోసం కాల్ షీట్స్ ఇచ్చిన ఎన్టీఆర్. హృతిక్‌తో కలిసి ఉన్న సీన్స్ కోసం..

Jr NTR allotted callsheets for Hrithik Roshan War 2 Movie

War 2 : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘వార్ 2’. SRF స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, శార్వరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం.. పక్క ప్లానింగ్ తో ముందుకు సాగుతుంది.

ఈక్రమంలోనే ఎన్టీఆర్ సీన్స్ తెరకెక్కించడం కోసం కూడా పక్క ప్రణాళికని సిద్ధం చేశారట. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ 60 రోజుల డేట్స్ ని ఇచ్చారట. వీటిలో 30 రోజులు తన సోలో సీన్స్ కోసం, మరో 30 రోజులు హృతిక్‌తో కలిసి ఉన్న సీన్స్ కోసమట. వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ‘రా ఏజెంట్’ గా కనిపించబోతున్నారని సమాచారం.

Also read : Jamie Lever : అల్లరి నరేష్ సినిమాతో.. టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ కమెడియన్ కూతురు..

టైగర్, పఠాన్, మేజర్ కబీర్‌లా ఎన్టీఆర్ పాత్రని కూడా SRF స్పై యూనివర్స్ లోకి తీసుకు రాబోతున్నారట. వార్ 2 తరువాత ఎన్టీఆర్ పాత్రతోనే సింగల్ గా ఓ మూవీ ఉండబోతుందట. బాలీవుడ్ ఎంట్రీతోనే ఎన్టీఆర్ భారీ ప్రాజెక్ట్స్ ని సెట్ చేస్తుండడంతో ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరి వార్ 2లో తన ప్రెజెన్స్ తో ఎలాంటి పవర్ స్ట్రోమ్ ని తీసుకు వస్తారో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని 2025 ఆగష్టు 14న రిలీజ్ చేయబోతున్నారు.

ఇక ఎన్టీఆర్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగం షూటింగ్ ఏప్రిల్ నాటికి పూర్తి కానుందని, ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్ వార్ 2కి షిఫ్ట్ అవుతారని సమాచారం. వార్ 2, దేవర 2 షూటింగ్స్ పూర్తి అయిన తరువాతనే ప్రశాంత్ నీల్ సినిమాని పట్టాలు ఎక్కించనున్నారని తెలుస్తుంది.