RRR : రామ్ – భీమ్.. పోస్టర్ అదిరిందిగా..!
ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ నుండి రిలీజ్ చేసిన న్యూ పోస్టర్ మెగా - నందమూరి అభిమానులను, సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది..
- sekhar
- Updated on- June 29, 2021 / 04:07 PM IST
Jr Ntr And Ram Charan New Poster From Rrr Movie
RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం, రణం, రుధిరం’.. ఇప్పటివరకు విడుదల చేసిన రామ్, భీమ్ వీడియోలు రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించాయి..
ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. చెర్రీ, తారక్ ఇద్దరూ షూటింగులో పాల్గొంటున్నారు. రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’ లొకేషన్‌లో కూల్ లుక్‌లో స్టైలిష్‌గా ఉన్న చరణ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
RRR Movie : డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్.. 10 భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్న ‘ఆర్ఆర్ఆర్’..!
ఇప్పటికి రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి అయింది. ఆల్రెడీ తారక్, చెర్రీ రెండు భాషల్లో డబ్బింగ్ పూర్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా ‘RRR’ షూటింగ్ పూర్తవుతుందని రాజమౌళి అన్నారు.
మంగళవారం ఉదయం ఈ సినిమానుండి మరో కిరాక్ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. ఎన్టీఆర్ బుల్లెట్ నడుపుతుండగా అతని భుజాలపై చేతులు వేసి చరణ్ వెనుక కూర్చుని ఉన్నాడు. ఈ పోస్టర్ మెగా – నందమూరి అభిమానులను, సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అన్నీ అనుకున్నట్టు కుదిరితే దసరా కానుకగా అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ ఆడియెన్స్ ముందుకు రానుంది.
