RRR Movie : డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్.. 10 భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్న ‘ఆర్ఆర్ఆర్’..!

‘బాహుబలి’ రెండు పార్టులతో తెలుగు సినిమా స్థాయిని పెంచి, తెలుగు సినిమా సత్తా ఇదీ అని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ తో మన తెలుగు సినిమా రేంజ్‌ని మరింత పెంచబోతున్నారు..

RRR Movie : డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్.. 10 భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్న ‘ఆర్ఆర్ఆర్’..!

Rrr Movie Digital And Satellite Rights Details

RRR Movie: ‘బాహుబలి’ రెండు పార్టులతో తెలుగు సినిమా స్థాయిని పెంచి, తెలుగు సినిమా సత్తా ఇదీ అని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ తో మన తెలుగు సినిమా రేంజ్‌ని మరింత పెంచబోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ రికార్డ్ రేటుకి అమ్ముడయ్యాయి.. రీసెంట్‌గా డిజిటల్, శాటిలైట్ పార్ట్‌నర్స్ డీటెయిల్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్..

‘ఆర్ఆర్ఆర్’ తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం డిజిటల్ రైట్స్ జీ5 దక్కించుకుంది.. హిందీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.. స్టార్ మా (తెలుగు- తమిళ్ – కన్నడ), జీ సినిమా (హిందీ), ఏషియానెట్ (మలయాళం) శాటిలైట్ రైట్స్ తీసుకున్నారు.. ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, టర్కిష్ అండ్ స్పానిష్ భాషల హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది.. మొత్తం పది భాషల్లో ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది..

Komaram Bheem NTR : గోండు బెబ్బులి గాండ్రింపు.. ‘ఆర్ఆర్ఆర్’ నుండి యంగ్ టైగర్ న్యూ పోస్టర్..

ఈ సందర్భంగా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ తీసుకున్న సంస్థల వారు దర్శకుడు రాజమౌళి, నిర్మాత డి.వి.వి. దానయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు.. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌కి కరోనా కారణంగా బ్రేక్ పడింది.. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది..