Komaram Bheem NTR : గోండు బెబ్బులి గాండ్రింపు.. ‘ఆర్ఆర్ఆర్’ నుండి యంగ్ టైగర్ న్యూ పోస్టర్..

నేడు (మే 20) తారక్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం.. యంగ్ టైగర్ ఈ సినిమాలో గోండు బెబ్బులి కొమరం భీమ్ క్యారెక్టర్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే..

Komaram Bheem NTR : గోండు బెబ్బులి గాండ్రింపు.. ‘ఆర్ఆర్ఆర్’ నుండి యంగ్ టైగర్ న్యూ పోస్టర్..

Ntr As The Intense Komaram Bheem From Rrr Movie

Komaram Bheem NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం, రణం, రుధిరం’.. ఇప్పటివరకు విడుదల చేసిన రామ్, భీమ్ వీడియోలు రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించాయి..

RRR

నేడు (మే 20) తారక్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం.. యంగ్ టైగర్ ఈ సినిమాలో గోండు బెబ్బులి కొమరం భీమ్ క్యారెక్టర్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే.. ఆ పాత్రకు సంబంధించి తారక్ కిరాక్ లుక్ వదిలారు మేకర్స్.. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌కి కరోనా కారణంగా బ్రేక్ పడింది..

Komaram Bheem NTR

ఇక ఈ పోస్టర్ విషయానికొస్తే.. కొమరం భీమ్ నీటిలో ఎగురుతూ బల్లెం విసురుతున్న పోస్టర్ అదిరిపోయింది.. తారక్ కళ్లల్లో ఫైర్ ఆకట్టుకుంటోంది.. తారక్‌కు జోడీగా ఒలివియా మోరిస్ కనిపించనుంది. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల వాయిదా పడే అవకాశముంది..

RRR