JR NTR : సిగ్గుచేటు.. ఆ నీచులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను.. ఎన్టీఆర్ వార్నింగ్..
చుట్టమల్లే పాట వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి మార్ఫింగ్ చేయడం పై జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Thota Vamshi Kumar
- Updated on- October 3, 2026 / 02:43 PM IST
Jr NTR condemns morphed Chuttamalle video and vows legal action
JR NTR : దేవర మూవీలోని ‘చుట్టమల్లే’ పాట వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి మార్ఫింగ్ చేయడం పై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సాంగ్‌లో జాన్వీ కపూర్ కనిపించిన దృశ్యాలను ఏఐ ఉపయోగించి అత్యంత అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడం పట్ల ఆయన మండిపడుతున్నారు. ఇలా చేసిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించాడు.
‘మహిళలను తల్లులుగా, దేవతలుగా పూజించే దేశం మనది. ‘మాతృదేవో భవ’ అనేది కేవలం ఒక మాటగా మాత్రమే కాకుండా మన సంస్కృతిలో భాగమైన ఈ గడ్డపై.. కొందరు వ్యక్తులు ఎంతగానో దిగజారిపోయారు. ఒక మహిళను అవమానించేలా ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఇలాంటి నీచమైన కంటెంట్‌ను సృష్టించడం సిగ్గుచేటు. చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్ వీడియో వెనక ఉన్న నీచులను ఎవరిని వదిలిపెట్టను . ఈ వీడియోను రూపొందించిన వారితో పాటు దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చట్టమైన చర్యలు తీసుకుంటాను.’ అని ఎన్టీఆర్ హెచ్చరించారు.
Shruti Haasan : శృతిహాసన్ ఫోటోలు.. సిల్వర్ డ్రెస్‌లో మెరిసిపోతూ..
Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where “Matrudevo Bhava” is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using…
— Jr NTR (@tarak9999) October 3, 2026
ఇలాంటి కంటెంట్ ను ఎవరూ చూడొద్దని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. ‘ఈ రోజు వేరొక మహిళకు ఇలాంటి అవమానం జరిగింది. రేపు మీ తల్లి లేదా భార్య లేదా కూతురుకూ ఇదే పరిస్థితి ఎదురుకొవొచ్చు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టడానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కఠినమైన నిబంధనలు తీసుకురావాలని కోరుతున్నాను.’ అని ఎన్టీఆర్ తెలిపారు.
