Devara : ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి సాలీడ్ అప్డేట్.. సరికొత్త పోస్టర్‌తో.. ఫ్యాన్స్‌కు పూనకాలే
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ దేవర.
- Thota Vamshi Kumar
- Updated on- September 7, 2024 / 01:03 PM IST
Jr Ntr Devara Trailer release on September 10th
Devara Trailer : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ ‘దేవర’. సెప్టెంబర్ 27న ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ బాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే మూడు పాటలను విడుదల చేసింది. ఈ పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
విడుదలకు మరో మూడు వారాలే సమయం ఉండడంతో ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారా అని చర్చ జరుగుతుండగా తాజాగా చిత్ర బృందం సాలీడ్ అప్డేట్ ఇచ్చింది. ట్రైలర్ విడుదల తేదీని చెప్పేసింది. సెప్టెంబర్ 10న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
Allu Arha : అల్లు అర్జున్ కూతురు అర్హ ఎంత చక్కగా వినాయకుడి పూజ చేసిందో చూశారా..?
ట్రైలర్ నిడివి దాదాపుగా 2 నిమిషాల 45 సెకన్లు ఉండనుందని, ముంబైలో భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహకాలు చేస్తుందని టాక్. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారానే జాన్వీకపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
Mr Bachchan : ఓటీటీలోకి రవితేజ ‘మిస్టర్ బచ్చన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
