Allu Arha : అల్లు అర్జున్ కూతురు అర్హ ఎంత చక్కగా వినాయకుడి పూజ చేసిందో చూశారా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Ganesh Chaturthi icon star Allu Arjun daughter Allu Arha video viral
Allu Arha- Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత మెయిన్ లీడ్‌తో వచ్చిన శాకుంతలం మూవీలో భరతుడు పాత్రలో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది. ఇక నేడు (సెప్టెంబర్ 7) వినాయక చవితి సందర్భంగా అర్హ ఇంట్లో పూజ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక మందాన కథానాయిక. డిసెంబర్ 6న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mr Bachchan : ఓటీటీలోకి రవితేజ ‘మిస్టర్ బచ్చన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందన్నారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌కి ఫస్ట్ హాఫ్ అయిపోతుందని చెప్పారు. నవంబర్‌కి సినిమా షూటింగ్ పూర్తి చేస్తామన్నారు. వినాయక చవితికి ఎలాంటి అప్డేట్ ఉండదన్నారు. రెండు పాటలు మిగిలి ఉన్నాయని.. సెప్టెంబర్ చివరిలో ఓ సాంగ్, అక్టోబర్‌లో ఓ సాంగ్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 20 నుంచి ప్రమోషన్స్ స్టార్ చేస్తామని చెప్పారు.
— Allu Arjun (@alluarjun) September 7, 2024