RRR Jr NTR Injury : ఎన్టీఆర్‌కు గాయం.. ఆందోళనలో అభిమానులు, వివరణ ఇచ్చిన RRR బృందం

ద‌ర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ సంద‌ర్భంగా

Rrr Jr Ntr Injury

RRR Jr NTR Injury : ద‌ర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ సంద‌ర్భంగా ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌కు సంబంధించిన ఓ వీడియోను నిన్న చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. షూటింగ్ గ్యాప్‌లో చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, రాజమౌళి ఎలా చిల్ అవుతున్నారో ఆ వీడియో ద్వారా చూపించారు. అయితే, ఈ వీడియోను బాగా ప‌రిశీలించి చూస్తే ఎన్టీఆర్ క‌ను బొమ్మ‌ పైన ఓ గాయం క‌న‌ప‌డుతోంది.

ఈ విష‌యాన్ని గుర్తించిన అభిమానులు కంగారు పడ్డారు. తమ అభిమాన హీరోకు ఏమైంద‌ని ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ వైర‌ల్ అవుతోంది. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ దీనిపై వివ‌ర‌ణ ఇచ్చింది. ఎన్టీఆర్ క‌ను బొమ్మ పైన ఉన్న ఆ గాయం నిజ‌మైంది కాద‌ని, షూటింగ్‌లో భాగంగా పెట్టింద‌ని చెప్పింది. అది గాయం కాదు మేక‌ప్ అని క్లారిటీ ఇవ్వ‌డంతో అభిమానుల హార్ట్ బీట్ కాస్త త‌గ్గింది. సినిమా షూటింగ్‌లో భాగంగా ఎన్టీఆర్ అలా గాయంతో క‌నిపించారని, నిజంగా గాయం కాదని తెలియ‌డంతో ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు.

ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ న‌టిస్తున్నారు. వారిద్ద‌రు చిరున‌వ్వులు చిందిస్తూ కూర్చున్న ఈ వీడియో అభిమానులను అల‌రిస్తోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే దాదాపు పూర్త‌యింది. బాహుబలి త‌ర్వాత‌ రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది.

అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి మేకింగ్ వీడియో విడుద‌ల చేసి అంచ‌నాలు భారీగా పెంచింది ఆర్ఆర్ఆర్ టీం. ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మాతగా ఈ పాన్-ఇండియా చిత్రం రాబోతోంది. ప్రస్తుతం ఆర్‌ఆర్ఆర్‌ టీమ్‌ ఉక్రెయిన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

షూటింగ్‌కు మధ్యలో దొరికిన కాస్త విరామ సమయంలో తన హీరోలతో సరదాగా గడిపారు జక్కన్న. రామ్ చరణ్‌, తారక్‌ పిట్టగోడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుండగా.. ఆ దృశ్యాలను రాజమౌళి ఒక డమ్మీ కెమెరాతో చిత్రీకరిస్తున్నట్లు కనిపించారు. ఈ వీడియోను RRR టీమ్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. ఈ వీడియో నందమూరి అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది.