నందమూరి తారక రామారావు గారి 24వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘూట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు..
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నినదించిన తెలుగు ప్రజల ఆరాధ్యదైవం.. తెలుగు ప్రజల చేత అన్నా అని పిలిపించుకున్న ఏకైక నాయకుడు.. తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని, తెలుగు వాడి సత్తాని దశ దిశలా వ్యాపింపజేసిన మహనీయుడు..
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డా. నందమూరి తారక రామారావు గారి 24వ వర్థంతి నేడు (జనవరి 18). ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘూట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు.
నారా భువనేశ్వరి, నారా దేవాన్ష్, దగ్గుబాటి పురంధరీశ్వరి, వెంకటేశ్వర రావు, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ వీరాభిమాని, దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి తదితరులు తారక రామునికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.