Jr NTR : బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వకుండానే.. రెండో సినిమా ఓకే చేసిన ఎన్టీఆర్.. YRF స్పై యూనివర్స్‌లో?

తాజాగా YRF స్పై యూనివర్స్ నుంచి రెండు అప్డేట్స్ బాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి.

Jr NTR Multiple Films in YRF Spy Universe Bollywood News goes Viral

Jr NTR : RRR సినిమాతో ఎన్టీఆర్ నార్త్ లో కూడా బాగా పాపులర్ అయ్యారు. అక్కడి స్టార్స్ అంతా ఎన్టీఆర్ తో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ కి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ YRF స్పై యూనివర్స్ లో తెరకెక్కుతున్న వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ నటిస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా YRF స్పై యూనివర్స్ నుంచి రెండు అప్డేట్స్ బాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ ‘రా ఏజెంట్’ గా కనిపించబోతున్నాడని సమాచారం. అలాగే YRF స్పై యూనివర్స్ లో సపరేట్ గా ఎన్టీఆర్ తో సింగిల్ ఫిలిం ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. YRF స్పై యూనివర్స్ లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, జాకీ ష్రాఫ్.. ఇప్పటికే ఉండగా ఎన్టీఆర్ కూడా వార్ 2 సినిమాతో అందులో చేరుతున్నాడని అభిమానులు ఆనందిస్తున్నారు. అలాగే వేరే YRF స్పై యూనివర్స్ సినిమాల్లో కూడా ఎన్టీఆర్ భవిష్యత్తులో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చే అవకాశం కూడా అందని తెలుస్తుంది.

Also Read : WAR 2 : వార్ 2 సెట్స్‌లోకి హృతిక్.. ఎన్టీఆర్ అప్పుడే ఎంట్రీ ఇవ్వనున్నారు..

YRF స్పై యూనివర్స్ లో సింగిల్ హీరో ఫిలిం ఎన్టీఆర్ కి ఉండబోతుందని వార్తలు వైరల్ అవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ బాలీవుడ్ లో చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. దేవర పాన్ ఇండియా తర్వాత పాపులారిటీ మరింత పెరుగుతుందని, ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలు ఖాయమని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు