Komuram Bheemudo Lyrics: రక్తం మరిగించే ‘కొమురం భీముడో’ పాట.. లిరిక్స్, వాటి అర్థం తెలుసుకోండి!

రిలీజ్ కు ముందే టీజర్లు, ట్రైలర్లు, పాటలతో ప్రేక్షకులు, సినీ ప్రేమికుల రక్తం మరిగిస్తున్నాడు. తాజాగా విడుదలైన కొమురం భీముడో.. పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయనేది...

Komuram Bheemudo Song Lyrics : RRR-ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు ముందే మరో ఎమోషనల్ వైబ్రేషన్ క్రియేట్ చేసింది. స్వాతంత్య్ర సమర యోధులైన కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలతో  కల్పిత 70MM యుద్ధ వీరగాథ సృష్టించిన రాజమౌళి.. రిలీజ్ కు ముందే టీజర్లు, ట్రైలర్లు, పాటలతో ప్రేక్షకులు, సినీ ప్రేమికుల రక్తం మరిగిస్తున్నాడు. తాజాగా విడుదలైన కొమురం భీముడో.. పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయనేది ఫ్యాన్స్ చెబుతున్న మాట.

సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను కీరవాణి స్వరపరిచారు. ఆయన కొడుకు కాలభైరవ ప్రాణం పెట్టి పాడాడు. బానిస బతుకులు.. స్వేచ్ఛా పోరాటం.. పోరాట కాంక్ష.. రగిలే ఆవేశం.. ఇవన్నింటినీ హైలైట్ చేస్తూ.. డార్క్ బ్యాక్ గ్రౌండ్ లో ప్రత్యేకంగా వీడియో షూట్ చేశారు. దీంట్లో ఎన్టీఆర్ రూపాన్ని తలపిస్తూ కాలభైరవ అభినయించాడు. పాటకు తగ్గ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ.. ఫీల్ ను పీక్స్ కు తీసుకెళ్లాడు.

ఆదిలాబాద్ జిల్లాలో గోండులు వాడే లోకల్ పదాలతో సుద్దాల అశోక్ తేజ ఈ పాటను రాశారు. అద్భుతమైన పదాలను వాడుతూ కొమురం భీమ్ తెగువను చాటారు రైటర్. కొర్రాయి, నెగడు, కాల్మొక్తా బాంచెన్ లాంటి పదాలతో ప్రత్యేకత చూపించారు. పాటలోని లిరిక్స్(సాహిత్యం), వాటి ఇక్కడ చూద్దాం.

కొమురం భీముడో పాట సాహిత్యం- Komuram Bheemudo Song Lyrics in Telugu

సాకి :

భీమా..
నిన్ను గన్న నేలతల్లి.. ఊపిరి పోసిన సెట్టు సేమ.. పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా.. వినపడుతుందా..

పల్లవి : కొమురం భీముడో.. కొమురం భీముడో..
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో
(కొర్రాసు నెగడు అంటే కొర్రాయి.. కాలే కట్టె చివర్లో జ్వాల)

కొమురం భీముడో .. కొమురం భీముడో..
రగరాక సూరీడై రగలాలి కొడుకో.. రగలాలి కొడుకో..

చరణం 1 :

కాల్మొక్తా బాంచెన్ అని వొంగి తోగాల..( వంగితే కనుక)
కారడవి తల్లికి పుట్టనట్టేరో.. పుట్టనట్టేరో..

జులుము గద్దెకు తలను ఒంచితోగాలా..(తల వంచితే కనుక)
జుడుము తల్లి పేగున పెరగానట్టేరో..(జుడుము అంటే అడవి)

కొమురం భీముడో.. కొమురం భీముడో..
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో

చరణం 2 :

చర్మమొలిచే దెబ్బకు ఒప్పంతోగాల..(తీవ్ర గాయాలకు తట్టుకోకపోతే కనుక)
సిలికే రక్తం సూసి సెదిరేతోగాల.. ( రక్తం చూసి ధైర్యం చెదిరితే కనుక)
బుగులేసి కన్నీరు ఒలికితోగాల.. (భయంతో కన్నీరు పెడితే కనుక)
భూతల్లి సనుబాలు తాగనట్టేరో.. తాగనట్టేరో..

కొమురం భీముడో.. కొమురం భీముడో..
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో

చరణం 3 :

కాలువై పారే నీ గుండె నెత్తురు
నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు
అమ్మకాళ్ల పారాణైతుంది సూడు
తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు
కొమురం భీముడో.. కొమురం భీముడో..
పుడమి తల్లికి జన్మ భరణమిస్తివిరో కొమురం భీముడో..

Read Also : RRR New Song : వివాదంలో ‘ఆర్ఆర్ఆర్’ సాంగ్.. కాపీ కొట్టారంటూ నెటిజన్ల ఆగ్రహం

ట్రెండింగ్ వార్తలు