RRR New Song : వివాదంలో ‘ఆర్ఆర్ఆర్’ సాంగ్.. కాపీ కొట్టారంటూ నెటిజన్ల ఆగ్రహం

ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి శుక్రవారం విడుదలైన కొమురం బీముడో.. పాటపై సోషల్ మీడియా వేడుకగా వివాదం నెలకొంది. ఈ పాటను కాపీ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు

RRR New Song : వివాదంలో ‘ఆర్ఆర్ఆర్’ సాంగ్.. కాపీ కొట్టారంటూ నెటిజన్ల ఆగ్రహం

RRR

RRR New Song : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిచిన ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం సినీ అభిమానులు ఎంతగానో వేచిచూస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. సినిమా స్కూటింగ్ పూర్తి కావడంతో ప్రమోషన్స్ పై దృష్టిపెట్టింది చిత్రబృందం. ఇటీవల ముంబైలో ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించగా.. బాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు.

చదవండి : RRR: కొమురం భీముడో.. ఆర్ఆర్ఆర్ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే పాట!

ఇక ఈ చిత్ర వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గత కొద్దీ రోజులుగా ఈ సినిమా నుంచి వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. శుక్రవారం కూడా ఓ పాటను విడుదల చేశారు. కొమురం భీముడో అంటూ సాగే ఈ పాటను ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ్ రచించగా.. కీరవాణి కుమారుడు కాల భైరవ ఆలపించారు. అయితే ఈ సాంగ్ కాపీ చేశారంటూ నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి : RRR: అమెరికాలో ఆర్ఆర్ఆర్ రచ్చ.. విడుదలకు ముందే రికార్డులు!

ప్రముఖ గాయకుడు గద్దర్ రాసి పడిన మదనా సుందరి మదనా సుందరి అనే పాట మాదిరిగానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాట వింటుంటే ఆచం గద్దర్ గొంతుతో పడినట్లే ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మ్యూజిక్ కూడా మదనా సుందరి పాటకు ఉన్నట్లే అచ్చంగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో ట్రేండింగ్‌గా మారింది