RRR: కొమురం భీముడో.. ఆర్ఆర్ఆర్ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే పాట!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వలో తెరకెక్కిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’.

RRR: కొమురం భీముడో.. ఆర్ఆర్ఆర్ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే పాట!

Komuram Bheemudo

RRR: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వలో తెరకెక్కిన పాన్ ఇండియా విజువలైజ్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా భారీ ఎత్తున రూపొందిన పీరియాడికల్ సినిమా. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుథిరం) నుంచి నరాలు తెంపెసే స్థాయిలో మ్యూజిక్ చేసిన ఓ పాట విడుదలైంది. కొమురం భీముడో.. కొమురం భీముడో.. మండాలి కొడుకో అంటూ సాగే అద్భుతమైన సాంగ్ వచ్చేసింది.

ఈ పాటకు కీరవాణి సంగీతం అందించగా.. కాలభైరవ పాడారు. శుద్దాల అశోక్ తేజ ఈ పాటను రాశారు. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలకు సిద్ధం అవుతోండగా.. సినిమాకు సంబంధించి ప్రమోషన్‌లను వేగంగా చేస్తుంది చిత్రయూనిట్.

ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లోనూ ఆర్ఆర్ఆర్ టీమ్ చుట్టేస్తుంది. ముంబైలో ఇప్పటికే నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యారు. ఈ సినిమా టిక్కెట్లను ఇప్పటికే అమెరికాలో అమ్ముతున్నారు.