Jr NTR Cookies : జూనియర్ ఎన్టీఆర్ కుకీస్ కి ఈ బుజ్జి పిల్లల రివ్యూ.. ‘ఆమ్ బావుందా..?’ అంటే..
జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా తయారు చేసిన కుకీలు (Jr NTR Cookies) తిన్న చిన్నారులు ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది.
- Thota Vamshi Kumar
- Updated on- June 7, 2026 / 12:53 PM IST
Jr NTR self made Cookies send to his fan sai teja childrens
Jr NTR Cookies : జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి స్వయంగా కుకీస్ తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇటీవల ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టగా అది వైరల్‌గా మారింది. సాయి తేజ అనే అభిమాని.. అన్నా మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వారి కోసం రెండు కుకీలు పంపన్నా అని కోరగా.. అడ్రస్ పెట్టు అని ఎన్టీఆర్ ఫన్నీగా రిప్లై ఇచ్చారు.
తన అభిమాన నటుడి నుంచి రిప్లై రాగానే సాయి తేజ సంతోషంతో తన అడ్రస్ పెట్టాడు. ఇంకేముంది ఎన్టీఆర్ వెంటనే తన ఆటోగ్రాఫ్‌తో పాటు తాను స్వయంగా తయారు చేసిన కుకీస్‌ను అతడి ఇంటికి పంపించాడు. దీంతో సాయి తేజ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ.. మూడు రోజుల్లో పెద్ది వసూళ్లు ఎంతంటే?
ఇక ఆ కుకీలను పిల్లలు తింటున్న వీడియోను షేర్ చేసి ఈ విషయాన్ని సాయి తేజ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కుకీలు బాగున్నాయా ? అని పిల్లలను అడిగితే ఎంతో బాగున్నాయని చెప్పారు. ఇక తారక్ మామ అంటే ఎంతో ఇష్టం అని ముద్దు ముద్దుగా ఆ చిన్నారులు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..
ఇక సినిమాల విషయానికి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న డ్రాగన్ మూవీలో నటిస్తున్నారు.
