Peddi Collections : బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ.. మూడు రోజుల్లో పెద్ది వసూళ్లు ఎంతంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది (Peddi Collections) చిత్రం బాక్సాఫీష్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది
Ram Charan Peddi movie 3 days Collections
Peddi Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది చిత్రం బాక్సాఫీష్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 236.7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్రం బృందం తెలియజేసింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే 200కి పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేడు (ఆదివారం) కావడంతో ఈ చిత్ర వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఈ చిత్రం తొలి రోజున 135.36 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.
Actress Soniya Singh : బ్లాక్ శారీలో సోనియా సింగ్ క్యూట్ పిక్స్..
జాన్వీకపూర్ హీరోయిన్గా నటించగా.. జగపతి బాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ, రవి కిషన్ కీలక పాత్రలను పోషించిన ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక రామ్‌చరణ్ నటన, గ్రామీణ నేపథ్యం, క్రీడల అంశాలు, ఎమోషనల్ కంటెంట్‌కు ఫ్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా ఈ మూవీని నిర్మించారు.
BOX OFFICE CHAMPION #PEDDI IS UNSTOPPABLE 🔥🔥#Peddi collects a gross of 236.7 CRORES GROSS WORLDWIDE in 3 days ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/EMhY3eMGKq#PEDDI in cinemas NOW 💥 pic.twitter.com/OotedmRSpx— PEDDI (@PeddiMovieOffl) June 7, 2026
