Jungle Boogie : అడవిలో రియాలిటీ షో.. జంగిల్ బుగి.. మీరు పాల్గొనాలి అనుకుంటున్నారా?
అడవిలో జంగిల్ బుగి అనే ఓ రియాలిటీ షోని ప్లాన్ చేస్తున్నారు. (Jungle Boogie)
- Saketh U
- Published on- May 16, 2026 / 06:48 PM IST
Jungle Boogie
Jungle Boogie : బిగ్ బాస్ అనంతరం అనేక రియాలిటీ షోలు వస్తున్నాయి. ఇప్పుడు అడవిలో నిర్వహించేలా జంగిల్ బుగి అనే ఓ రియాలిటీ షోని ప్లాన్ చేస్తున్నారు. రియాల్టీ షో జంగిల్ బుగి అనౌన్స్ ఈవెంట్ హైదరాబాద్ లో. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్.. ఇలా ఐదు టీమ్స్ ఈ షోలో ఉండనున్నాయి. ఈ నెల 17,18వ తేదీల్లో దీనికి సంబంధించిన ఆడిషన్స్ హైదరాబాద్ లో ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించి పోటీదారులను ఎంపికచేయనున్నారు. ఈ ఆడిషన్స్ కి ఎవరైనా వెళ్లొచ్చు. ఈ ఆడిషన్స్ లో ఎంపికైన వాళ్ళు 90 రోజుల పాటు అడవిలో ఉంటూ కార్యక్రమ నిర్వాహకులు చెప్పే సాహసాలు చేయాలి. ఎలిమినేషన్స్ తట్టుకుని చివరివరకు నిలబడిన టీమ్ విజేత గా నిలుస్తారు అని ఈ కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.
ఈ జంగిల్ బుగి లాంచ్ ఈవెంట్లో ఈ ప్రోగ్రాం డైరెక్టర్ యశోధర విక్రమ్ మాట్లాడుతూ.. నేను దర్శకుడిగా, రైటర్ గా కన్నడ పరిశ్రమలో పలు సినిమాలు చేశాను. గతంలో కొన్ని రియాల్టీ షోస్ చేసిన నా ఫ్రెండ్ ఇచ్చిన ఈ షో కాన్సెప్ట్ నచ్చి సినిమా కంటే ముంది ఇది చేయాలి అనుకున్నాను. కాన్సెప్ట్ విన్న తర్వాత ఇది చాలా కష్టమైన రియాల్టీ షో, ఛాలెంజింగ్ గా ఉంటుందని అనిపించింది. జంగిల్ బుగికి దర్శకత్వం వహించడం ఛాలెంజింగ్ గా తీసుకున్నాను అని అన్నారు.
Also Read : Anna Lezhneva : తన పెంపుడు కుక్కలతో పవన్ కళ్యాణ్ భార్య.. అన్నా లెజినోవా ఫొటోలు వైరల్..
ఎపిక్ ప్రొడక్షన్స్ అధినేత పార్థసారథి మాట్లాడుతూ.. పేరుకే వివిధ రాష్ట్రాల నుంచి పోటీ పెట్టాం కానీ మన కల్చర్ ఒకటే అనే చెప్పే ఉద్దేశంతో ఈ షో చేస్తున్నాం. ప్రకృతికి మనం దూరమయ్యాం. అడవి కనుమరుగవుతోంది. అడవి, ప్రకృతి ఎంత గొప్పగా ఉంటాయో అందరికి తెలియాలనే ఈ షో చేస్తున్నాం అన్నారు. క్రియేటివ్ టీమ్ రషీద్ మాట్లాడుతూ.. మా రియాల్టీ షో రియల్ గా ఉంటుంది. ఫారెస్ట్ లో 90 రోజుల పాటు అనేక అడ్వెంచర్స్ తో సాగే సరికొత్త రియాల్టీ షో జంగిల్ బుగి అని తెలిపారు.
సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. రియాల్టీ షోను పాన్ ఇండియా మూవీ స్థాయిలో డిజైన్ చేయడం గొప్ప విషయం. ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు వచ్చి పాల్గొనొచ్చు. అందులో సెలెక్ట్ అయితే 90 రోజులు అడివిలో ఉండి సాహసాలు చేసే ఈ రియాల్టీ షోలో పాల్గొంటారు అని తెలిపారు. సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ వైజే రాంబాబు మాట్లాడుతూ.. రియాల్టీ షోస్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తుంటాయి. జంగిల్ బుగి కూడా సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతోంది అని అన్నారు.
Also Read : Pradeep Kotte : జాబ్ చేస్తూనే సినిమా కూడా.. తిమ్మరాజుపల్లి టీవీ సెకండ్ హీరో గురించి తెలుసా..?
