Pradeep Kotte : జాబ్ చేస్తూనే సినిమా కూడా.. తిమ్మరాజుపల్లి టీవీ సెకండ్ హీరో గురించి తెలుసా..?
తిమ్మరాజుపల్లి టీవీ ఓటీటీలో వస్తుండగా నేడు నటుడు ప్రదీప్ మీడియాతో మాట్లాడుతూ తన గురించి, సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. (Pradeep Kotte)
Pradeep Kotte
Pradeep Kotte : ఇటీవల కిరణ్ అబ్బవరం నిర్మాతగా దాదాపు 50 మంది కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తూ తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమాని తెరకెక్కించాడు. టీవీ వచ్చిన కొత్తలో ఓ పల్లెటూరులో జరిగిన కథతో సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో ఏప్రిల్ 17న రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోగా నటుడు ప్రదీప్ కొట్టె తన పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు.
తిమ్మరాజుపల్లి టీవీ ఓటీటీలో వస్తుండగా నేడు నటుడు ప్రదీప్ మీడియాతో మాట్లాడుతూ తన గురించి, సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
Also Read : Keneeshaa : నేను ఓడిపోయాను.. అతన్ని వదిలేస్తున్నాను.. జయం రవి పై సింగర్ కెనిషా ఎమోషనల్ పోస్ట్..
ప్రదీప్ కొట్టె తన గురించి చెప్తూ.. చిత్తూరు జిల్లా పళమనేరు మాది. చెన్నైలో జాబ్ చేశాను. హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాక ఇక్కడ జాబ్ చేస్తూ షార్ట్ ఫిల్మ్స్ మొదలుపెట్టాను. బీ స్టూడియోలో బషీర్ మాస్టర్ నేతృత్వంలో నాటకాలు వేశాను. జాబ్ చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాను. వర్క్ ఫ్రమ్ హోం, లీవ్స్ అంటూ ఈ మూవీని కూడా చేశాను. పూర్తి స్థాయిలో నేను ట్రై చేయలేకపోవడంతోనే అవకాశాలు తొందరగా రాలేదేమో. పదేళ్ల నుంచి జాబ్, సినిమా ప్యాషన్ బ్యాలెన్స్ చేస్తున్నాను. నా ఫ్యామిలీ, నా భార్య చాలా సపోర్ట్ చేశారు. పదేళ్లుగా నాటకాలు వేస్తుండటంతో కెమెరా భయం పోయింది. డైలాగ్ డెలివరీ, డిక్షన్ వచ్చింది. ఒక నాటకంలో అయిదు పాత్రలు వేసాను అని తెలిపాడు.
ఈ సినిమా ఛాన్స్ గురించి మాట్లాడుతూ.. నేను వేసిన నాటకాల్ని చూసి డైరెక్టర్ మునిరాజు ఈ సినిమాలో నాకు రాజప్ప కారెక్టర్ ఇచ్చారు. నా పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మొదటి సినిమాకే నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ సినిమాలు చేశాను కానీ మొదటి సిల్వర్ స్క్రీన్ సినిమా ఇదే అని అన్నారు.
Also Read : Jayam Ravi : విడాకులు వచ్చేవరకు నటించను.. నాపై చేతబడి చేసి చంపాలని చూశారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో..
కిరణ్ అబ్బవరం గురించి చెప్తూ.. ఇంజనీరింగ్ టైంలో నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అప్పట్నుంచే నాకు నటన మీద ఇంట్రెస్ట్ వచ్చింది. మేం షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలోనే కిరణ్ అబ్బవరం నాకు తెలుసు. నేను ఒక ఆర్టిస్ట్ అని ఆయనకు కూడా తెలుసు. ఆయన ప్రతీ క్రాఫ్ట్ మీద పట్టు సాధించి ఈ స్థాయికి వచ్చారు. కిరణ్ అబ్బవరం నా మొదటి సినిమా నిర్మాత అనగానే మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది అని అన్నారు.

