KillR : ‘కిల్లర్’ గ్లింప్స్.. అద‌ర‌గొట్టిన జగతి మేడమ్‌

జ్యోతి పూర్వాజ్ న‌టిస్తున్న కిల్ల‌ర్ చిత్రం నుంచి గ్లింప్స్ ను విడుద‌ల చేశారు.

Jyoti Poorvaj KillR Glimpse out now

శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్‌ పీస్‌ వంటి వినూత్న చిత్రాలతో ఆకట్టుకున్నాడు దర్శకుడు పూర్వాజ్. ఆయన తెర‌కెక్కుస్తున్న‌ సైంటిఫిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కిల్లర్‌. ఈ చిత్రంలో పూర్వాజ్‌ హీరోగా న‌టిస్తుండ‌గా జ్యోతి పూర్వాజ్ క‌థానాయిక‌. విశాల్‌ రాజ్, గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో క‌నిపించ‌నున్నారు.

తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ గా లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్న‌ట్లుగా అర్థ‌మవుతోంది.

Bhogi : శర్వానంద్ కొత్త సినిమా అనౌన్స్.. పాన్ ఇండియా భోగి..

ఇప్ప‌టికే కిల్లర్‌.. పార్ట్‌ 1 డ్రీమ్‌ గర్ల్‌ షూటింగ్ పూర్తి అయింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈచిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. థింక్‌ సినిమా బ్యానర్‌పై ఏయు అండ్‌ ఐ, మెర్జ్‌ ఎక్స్‌ ఆర్‌ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్‌ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.