Bhogi : శర్వానంద్ కొత్త సినిమా అనౌన్స్.. పాన్ ఇండియా భోగి..
సంపత్ నంది దర్శకత్వంలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నాడు.

Director Sampath Nandi Charming Star Sharwanand movie title fix
సంపత్ నంది దర్శకత్వంలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నాడు. శర్వానంద్ సినీ కెరీర్ లో 38వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి ‘భోగి’ అనే పేరు ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఓ వీడియో రూపంలో తెలియజేశారు. ఈ రోజు నుంచే షూటింగ్ ప్రారంభించినట్లు వెల్లడించారు.
లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంపత్ నంది, రాధామోహన్ కాంబోలో సిటిమార్ తర్వాత వస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రంలో శర్వానంద్ మునుపెన్నడు కనిపించని లుక్ లో కనిపిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతిని కథానాయికలు నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు.
Venky-nani : వెంకీ, నాని మల్టీస్టారర్.. దర్శకుడు అతడేనా?
పిరియాడికల్ యాక్షన్ నేపధ్యంలో ఈ సినిమా పాన్ ఇండియా భాషలలో రూపుదిద్దుకుంటోంది.
ప్రస్తుతం శర్వానంద్.. నారి నారి నడుమ మురారి, అలాగే యువీ క్రియేషన్స్ లో మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి.