Venky-nani : వెంకీ, నాని మల్టీస్టారర్.. ద‌ర్శ‌కుడు అత‌డేనా?

సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అయిన తరువాత విక్టరీ వెంకటేష్ కాస్త టైమ్ తీసుకుంటున్నాడు.

Venky-nani : వెంకీ, నాని మల్టీస్టారర్.. ద‌ర్శ‌కుడు అత‌డేనా?

Gossip Garage Venky and nani Multi Starer Movie

Updated On : April 30, 2025 / 9:54 AM IST

సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అయిన తరువాత విక్టరీ వెంకటేష్ కాస్త టైమ్ తీసుకుంటున్నాడు. స్టోరీలు వింటున్నా.. ఇప్పటి వరకు ఏది కన్ఫామ్ చెయ్యలేదట. అయితే టాలీవుడ్ సర్కిల్ లో లేటెస్ట్ గా ఓ గాసిప్ మాత్రం జోరుగా విన్పిస్తోంది. విక్టరీ వెంకటేష్ ఓ స్టార్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ప్రస్తుతం ఆ స్టోరీ డిస్కర్షన్స్ జరుగుతున్నాయని టాక్. అయితే ఇందులో మరో స్టార్ హీరో కూడా వెంకీతో జట్టు కట్టబోతున్నాడని టాక్.

ఇప్పటికే వెంక‌టేష్‌, మహేష్, వ‌రుణ్ తేజ్ ల‌తో మల్టీస్టార‌ర్స్ చేశారు. ఈసారి మాత్రం నేచురల్ స్టార్ గా గుర్తింపు పొందిన నాని-వెంకీ కాంబోలో మల్టీస్టారర్ సినిమా రాబోతుందని టాక్. మరి దీనికి డైరెక్టర్ ఎవరంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే టాక్ చిత్ర వర్గాల్లో విన్పిస్తోంది.

Pawan Kalyan : నా కొడుకుని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నాము.. ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి..

అల్లు అర్జున్..త్రివిక్రమ్ కాంబోలో ఓ మైథాలజికల్ మూవీ వచ్చే ఏడాది సెట్స్ మీదకు రాబోతుందట. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమాతో ఒక సంవత్సరం పాటు బిజీగా ఉండబోతున్నాడు. ఈ టైంలో త్రివిక్రమ్.. వెంకటేష్, నాని సినిమా ఫినిష్ చేసే అవకాశాలున్నాయంటున్నారు. మరి ఇది నిజమా కాదా చూడాల్సి ఉంది.