Pawan Kalyan : నా కొడుకుని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నాము.. ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి..
నేడు జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన రావుకి నివాళులు అర్పించారు.

Pawan Kalyan Tells about his Son Mark Shankar Mental Condition after Fire Accident
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రెండో కొడుకు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్ స్కూల్ లో అగ్నిప్రమాదానికి గురయి కొన్ని రోజులు హాస్పిటల్ లో చికిత్స పొంది వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన కొడుకు గురించి మరోసారి మాట్లాడారు పవన్.
ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పలువురు పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఏపీకి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి కూడా మరణించారు. ఆయన జనసేన క్రియాశీలక సభ్యుడు కూడా కావడంతో నేడు జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన రావుకి నివాళులు అర్పించారు. అలాగే వారి కుటుంబానికి పార్టీ తరపున రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
Also Read : PM Modi: సైన్యానికి ఫుల్ పవర్స్..! త్రివిధ దళాధిపతుల భేటీలో మోదీ సంచలన ప్రకటన
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇటీవల నా కొడుకు స్కూల్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో ఒకరు చనిపోయారు, ఒకరికి కాళ్ళు, చేతులు కాలిపోయాయి. నా కొడుకు శరీరం లోపలికి పొగ వెళ్ళింది. ఆ సంఘటన తర్వాత నా కొడుక్కి అర్ధరాత్రి పూట ఆ మేడ మీద నుంచి పడిపోతున్నట్టు పీడ కలలు వస్తున్నాయి అని చెప్పాడు. ఒక సైకాలజిస్ట్ దగ్గర చూపిస్తున్నాము. అలాంటిది మధుసూదన్ గారి పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు పడుకుంటే నిద్ర పడుతుందా, తుపాకుల చప్పుళ్ళు, కళ్ళముందే తండ్రి ప్రాణాలు కోల్పోవడం కనిపిస్తాయి. ప్రాణాలు కోల్పోవడం ఒకటైతే, మానసికంగా దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం అని ఎమోషనల్ అయ్యారు పవన్.