Killr Teaser
Killr Teaser : జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా ‘కిల్లర్’. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మాణంలో పూర్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.(Killr Teaser)
ఈ కిల్లర్ టీజర్ చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు టెక్నాలజీ, దేశభక్తి.. లాంటి పలు అంశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న జ్యోతి పూర్వాజ్ ఈ సినిమాలు వివిధ పాత్రల్లో అదరగొట్టేసిందని అర్ధమవుతుంది. మీరు కూడా కిల్లర్ టీజర్ చూసేయండి..
ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ.. సీరియల్స్ లో రొటీన్ క్యారెక్టర్స్ చేస్తూ విసిగిపోయి ఉన్న టైమ్ లో డైరెక్టర్ సుకు పూర్వజ్ నన్ను కొత్తగా చూపించేందుకు ముందుకొచ్చారు. ఈ సినిమాలో ఆరేడు క్యారెక్టర్స్ పర్ ఫార్మ్ చేసే అవకాశం వచ్చింది. విజయశాంతి గారిలా యాక్షన్ చేయాలని డ్రీమ్ ఉండేది. అలాంటి అవకాశం కిల్లర్ సినిమాతో వచ్చింది. పెళ్లయ్యాక చాలా మంది పర్సనల్ వెకేషన్ కు వెళ్తారు కానీ మనం సినిమా చేద్దామని పూర్వాజ్ నాతో అన్నప్పుడు హ్యాపీగా అనిపించింది. సినిమా వల్ల చాలా మందికి ఎంతో కొంత ఉపాధి కల్పిస్తాం అని అనుకున్నాము. ఈ సినిమాతో జ్యోతి అంటే మంచి పర్ ఫార్మర్, పూర్వాజ్ అంటే మంచి డైరెక్టర్ అని అందరికి తెలుస్తుంది అని అన్నారు.
డైరెక్టర్ సుకు పూర్వాజ్ మాట్లాడుతూ.. ఐదారేళ్ల కిందట అనుకున్న స్క్రిప్ట్ ఇది. టీజర్ చాలా జాగ్రత్తగా కట్ చేసి అందులో 40 పర్సెంట్ మాత్రమే కంటెంట్ చుపించాము. థియేటర్ లో హండ్రెడ్ పర్సెంట్ సినిమా కథేంటి అనేది తెలుస్తుంది. టీజర్ లో చెప్పినట్లు మీ మేధస్సును ఉపయోగించండి అనేది ఎందుకు చెప్పామో మూవీ చూస్తే తెలుస్తుంది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ డ్రామా, బ్రదర్ సిస్టర్ బాండింగ్, రివేంజ్, సబ్ కాన్షియస్ ఐడెంటిటీ.. ఇలాంటి ఎలిమెంట్స్ తో సైఫై థ్రిల్లర్ గా కిల్లర్ సినిమాను తెరకెక్కించాము. రక్తిక అనే వ్యాంపైర్, రనియా అనే టెర్రరిస్ట్, రియా అనే స్పై, రై అనే విషపూరిత వుమెన్..ఈ క్యారెక్టర్స్ తో పాటు మేము రివీల్ చేయని మరో క్యారెక్టర్ లో జ్యోతి నటించింది అని తెలిపారు.