షాహిద్ కపూర్, కియారా అద్వాణీ హీరో, హీరోయిన్స్‌గా, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందిన కబీర్ సింగ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..
విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి, తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్, కియారా అద్వాణీ హీరో, హీరోయిన్స్‌గా, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో, భూషణ్ కుమార్, మురద్ ఖేతానీ, కృష్ణ కుమార్, అశ్విన్ వర్దే నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా కబీర్ సింగ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు మూవీ టీమ్. షాహిద్ కపూర్ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించాడు. షాహిద్, కియారాల కెమిస్ట్రీ బాగుంది.
అర్జున్ రెడ్డితో కంపేర్ చేస్తే, కబీర్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు అంతగా అనిపించక పోవచ్చు కానీ, బాలీవుడ్ వాళ్ళకి నచ్చుతుందీ ట్రైలర్.. అక్కడి పరిస్థితులకు తగ్గట్టు స్క్రిప్ట్‌లో మార్పులు చేసి, తెరకెక్కించాడు సందీప్.. ట్రైలర్‌లో సంతాన కృష్ణన్ రవిచంద్రన్ ఫోటోగ్రఫీ, హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. సోహమ్ మజుందార్, నిఖితా దత్తా, అమిత్ శర్మ, సురేష్ ఒబెరాయ్ తదితరులు నటిస్తున్న కబీర్ సింగ్ జూన్ 21న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి కో- ప్రొడ్యూసర్ : వినోద్ భనుషాలి, అసోసియేట్ ప్రొడ్యూసర్ : నీరజ్ కిషోర్ కొటారి, డైలాగ్స్ : సిద్ధార్థ్ – గరీమా, ఎడిటింగ్ : ఆరిఫ్ షేక్.
వాచ్ కబీర్ సింగ్ ట్రైలర్..