Kagitham Padavalu : ‘కాగితం పడవలు’ సాంగ్ లాంచ్ ఈవెంట్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

తాజాగా మరో కొత్త సాంగ్ రిలీజ్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. (Kagitham Padavalu)

  • Published on- September 2, 2026 / 07:17 AM IST

Kagitham Padavalu

Kagitham Padavalu : వర్ధన్, కృష్ణప్రియ జంటగా తెరకెక్కుతున్న సినిమా కాగితం పడవలు. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మాణంలో ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, ట్రైలర్‌, పలు సాంగ్స్ రిలీజవ్వగా తాజాగా మరో కొత్త సాంగ్ రిలీజ్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్ లో హీరో వర్ధన్ మాట్లాడుతూ.. ఒక కాలువలో ప్రయాణం చేయాలని అనుకున్నాం కానీ తెలియకుండానే ఒక సముద్రంలోకి వచ్చేశాం. ఎన్నోసార్లు ఒడ్డుకు వద్దాం అనుకున్నాం. కానీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రయాణంలో మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మా నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని రిలీజ్ చేయడం చాలా కష్టం. కాగితం పడవలు సినిమా సెప్టెంబర్ 18న థియేటర్స్‌లో రిలీజ్ కానుందని తెలిపారు.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే.. అందుబాటులో లేని డిప్యూటీ సీఎం.. ఎక్కడున్నారో తెలుసా..

దర్శకుడు తుకారాం మాట్లాడుతూ.. మా నిర్మాతలు లేకపోతే ఈ సినిమా ఇంత దూరం వచ్చేది కాదు. మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది. ఈ సినిమా చూస్తే మీ ప్రేమకథ మీకు గుర్తుకొస్తుంది అని అన్నారు. నిర్మాత అంజనప్ప మాట్లాడుతూ.. తుకారాం చాలా అద్భుతంగా సినిమా తీశారు. మా మేనేజర్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సెప్టెంబర్ 18న సినిమా రిలీజ్ అవుతుంది అని అన్నారు.