×
Ad

Kaikala Satyanarayana : అధికార లాంఛనాలతో కైకాల అంతక్రియలు..

శుక్రవారం నాడు అంతా ఆయన పార్థివ దేహాన్ని ఇంటివద్దే ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. నేడు శనివారం ఉదయం మహాప్రస్థానానికి అంతిమయాత్ర తరలివెళ్లనుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున.................

  • Published On : December 24, 2022 / 10:27 AM IST

Kaikala Satyanarayana funeral will happening by telangana government officially

Kaikala Satyanarayana : ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ సుస్థిరస్థానం సంపాదించుకున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం డిసెంబర్ 23 తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు కైకాల ఇంటికి తరలివెళ్లి ఆయనకి నివాళులు అర్పించారు. 60 ఏళ్ళ సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలతో దాదాపు 700 పైగా సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో గొప్ప పాత్రల్లో నటించి మెప్పించారు.

Kaikala Satyanarayana : యముడంటే కైకాల సత్యనారాయణే..

శుక్రవారం నాడు అంతా ఆయన పార్థివ దేహాన్ని ఇంటివద్దే ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. నేడు శనివారం ఉదయం మహాప్రస్థానానికి అంతిమయాత్ర తరలివెళ్లనుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కైకాల సత్యనారాయణకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని ప్రకటించారు. నేడు ఉదయం 11 గంటలకి మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగనున్నాయి. ఈ అంత్యక్రియలలో కుటుంబసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు, అభిమానులు పాల్గొననున్నారు.