Kaikala Satyanarayana : యముడంటే కైకాల సత్యనారాయణే..
కైకాల సత్యనారాయణ ఎన్ని పాత్రలు చేసినా కైకాల అంటే గుర్తొచ్చేది యముడి పాత్రే. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమగోల సినిమాలో యముడిగా ఎన్టీఆర్ కి పోటీగా నటించి ఆ పాత్రకి వన్నె తెచ్చారు. ఆ సినిమాలో ధర్మ పరిరక్షణ ధురంధరుండా.. యముండా.............

Kaikala Satyanarayana lived in the role of Yama
Kaikala Satyanarayana : సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ విషంలో మునిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. 60 ఏళ్ళ సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలతో దాదాపు 700 పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో గొప్ప పాత్రలు చేశారు కైకాల.
కైకాల సత్యనారాయణ ఎన్ని పాత్రలు చేసినా కైకాల అంటే గుర్తొచ్చేది యముడి పాత్రే. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమగోల సినిమాలో యముడిగా ఎన్టీఆర్ కి పోటీగా నటించి ఆ పాత్రకి వన్నె తెచ్చారు. ఆ సినిమాలో ధర్మ పరిరక్షణ ధురంధరుండా.. యముండా అంటూ డైలాగ్ డెలివరీతో నిజంగా యముడంటే ఇలాగే ఉంటాడేమో అని అందర్నీ నమ్మించారు. గంభీరంగా కనిపిస్తూ, కంచులాంటి స్వరంతో ఓ పక్క భయం పుట్టిస్తూనే మరోపక్క అద్భుతమైన నటనని ప్రదర్శించారు.
Kaikala Satyanarayana : సీనియర్ ఎన్టీఆర్ కోసం ఎన్నో సాహసాలు చేసిన కైకాల..
యమగోల సినిమా తర్వాత మళ్ళీ యముడి పాత్ర వేయాలంటే కైకాల సత్యనారాయణే వేయాలి అనుకునేవారు. ఆ సినిమా తర్వాత యమలీల, యముడికి మొగుడు, యమగోల మళ్లీ మొదలైంది, దరువు సినిమాల్లో కూడా యముడి పాత్రని వేసి మెప్పించారు. ఆ సినిమాల్లో కూడా యముడి పాత్రని మొదటిసారి వేసినప్పటిలాగే వేసి మెప్పించారు. మొత్తానికి తెలుగు పరిశ్రమలో యముడి పాత్ర వేయాలంటే కైకాల సత్యనారాయణే వేయాలి అనిపించుకున్నారు. టాలీవుడ్ లో యముడి పాత్రకి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు కైకాల. ఆ తర్వాత టాలీవుడ్ లో ఎన్ని యముడి పాత్రలు వచ్చినా వాటన్నిటికి యమగోల సినిమాలో కైకాల వేసిన యముడి పాత్రే ఆదర్శం.