పవర్‌స్టార్ చేతుల మీదుగా ‘కలియుగ’ పాటలు విడుదల

‘కలియుగ’ సినిమా ఆడియో పాటలను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేసి, చిత్రాబృందానికి శుభాకాంక్షలు తెలిపారు..

  • Publish Date - November 29, 2019 / 06:29 AM IST

‘కలియుగ’ సినిమా ఆడియో పాటలను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేసి, చిత్రాబృందానికి శుభాకాంక్షలు తెలిపారు..

రాజ్, స్వాతి దీక్షిత్ జంటగా, తిరుపతి దర్శకత్వంలో.. బాలాజీ సిల్వర్ స్ర్కీన్ బ్యానర్‌పై, నటుడు సూర్య (పింగ్ పాంగ్) నిర్మించిన సినిమా ‘కలియుగ’.. ఈ సినిమా ఆడియో పాటలను శుక్రవారం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేశారు.

మంచి సందేశంతో తీసిన ‘కలియుగ’ నిర్మాతగా సూర్యకు మంచి పేరు తెచ్చిపెట్టాలని, చిత్రాబృందానికి శుభాకాంక్షలు తెలిపారు వపన్. కమల్ కుమార్ కంపోజ్ చేసిన ఈ ఆల్బమ్‌లో మొత్తం ఆరు పాటలున్నాయి.

వరికుప్పల యాదగిరి నాలుగు పాటలు, శివ, శ్రీరామ్ తపస్వీ ఒక్కో పాట రాశారు. రేవంత్, శిల్ప, ధనుంజయ్, ప్రదీప్ సోమసుందరన్, వరికుప్పల యాదగిరి, కమల్ కుమార్ తదితరులు పాడారు. త్వరలో ‘కలియుగ’ విడుదల కానుంది.