Prabhas : ప్రభాస్ న్యూ లుక్ చూశారా.. ఒకప్పటి డార్లింగ్‌లా మారిపోయాడు..
సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ప్రభాస్ బరువు తగ్గి..
- gum 95921
- Published On : April 18, 2024 / 07:00 AM IST
Kalki 2898 Ad star Prabhas new look video gone viral in social media
Prabhas : బాహుబలి తరువాత ప్రభాస్ లుక్స్ లో చాలా చేంజెస్ వచ్చాయి. ఆ సినిమా తరువాత అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావడంతోనే.. ప్రభాస్ బాడీ ఫిట్‌నెస్ పై పెద్దగా దృష్టి సారించలేకపోయారని తెలుస్తుంది. అయితే ఇటీవల చికిత్స చేయించుకొని ప్రభాస్ పూర్తి ఆరోగ్యంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ ఇప్పుడు మళ్ళీ ఒక్కప్పటి లుక్స్ లోకి ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ప్రభాస్ బరువు తగ్గి, మిర్చి సమయంలోని లుక్స్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ వీడియోని షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. మరి ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.
Also read : Road Accident : ప్రముఖ సినీ నటుడి కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి
VINTAGE #PRABHAS IS BACK ?????????
Maintaining LEAN BODY ✅
— GetsCinema (@GetsCinema) April 17, 2024
కాగా ప్రభాస్ ప్రస్తుతం కల్కి మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కొన్ని ప్యాచ్ వర్క్స్ సంబంధించిన సీన్స్ ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు రోజుల్లో ఈ మూవీ రిలీజ్ డేట్ పై కూడా ఓ క్లారిటీ రానున్నది అంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని మే 9న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసారు. కానీ ఎలక్షన్స్ రావడంతో మూవీ పోస్టుపోన్ చేయాల్సి వచ్చింది.
ఈ సినిమాని జులైలో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారంటూ టాక్ వినిపిస్తుంది. మరి మూవీ టీం ఏ డేట్ అనౌన్స్ చేస్తుందో చూడాలి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్, దిశాపటాని హీరోయిన్స్, అమితాబ్ బచ్చన్, రాజేంద్రప్రసాద్, పశుపతి, కమల్ హాసన్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో సి అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
