Kalyaan Dhev : శ్రీజతో విడాకులు.. వారంలో నాలుగు గంటలు.. ఇన్‌స్టా పోస్ట్‌తో కల్యాణ్‌దేవ్ క్లారిటీ..!
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ(Sreeja), కల్యాణ్ దేవ్(Kalyan Dhev) లు కలిసి కనిపించక చాలా కాలమే అవుతోంది. సోషల్ మీడియాలో సైతం ఒకరిని మరొకరు అన్‌ఫాలో చేసుకున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : June 18, 2023 / 07:31 PM IST
Kalyan Dhev- Sreeja
Kalyan Dhev- Sreeja : మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ(Sreeja), కల్యాణ్ దేవ్(Kalyan Dhev) లు కలిసి కనిపించక చాలా కాలమే అవుతోంది. సోషల్ మీడియాలో సైతం ఒకరిని మరొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు అంటూ ఏడాదిన్నర కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మెగా ఫ్యామిలీ ఈవెంట్స్‌లో సైతం కల్యాణ్ దేవ్ కనిపించడం లేదు. దీంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై అటు శ్రీజ గానీ ఇటు కల్యాణ్ దేవ్ ఎవరూ స్పందించలేదు.
Honey Rose : అక్కడ ముద్దు పెట్టేందుకు చాలా పెద్ద రిస్క్ చేసిన హానీ రోజ్
విడాకుల వార్తలపై కనీసం ఒక్కరు కూడా స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజం కాదని వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉంటున్నారని త్వరలోనే కలుస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో కల్యాణ్ దేవ్ పోస్టు చూస్తే విడాకుల పై క్లారిటీ వచ్చినట్లుగానే కనిపిస్తోంది. తన కూతరు నవిష్కతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసిన కల్యాణ్ దేవ్.. వారంలో నేను ఎంతో ఆనందంగా గడిపే నాలుగు గంటలు ఇవే అంటూ రాసుకొచ్చాడు.
ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. నీ పిల్లలతో కలిసి ఉండేది నాలుగు గంటలేనా..? ఈ విషయం వినడానికే ఎంతో బాధగా ఉంది అంటే కామెంట్లు పెడుతున్నారు. సాధారణంగా దంపతులు విడాకులు తీసుకున్న సమయంలో న్యాయస్థానం పిల్లల బాధ్యతను ఎవరికి అప్పగించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది. తల్లి లేదా తండ్రి ని ఎప్పుడు కలవాలి, ఎన్ని గంటలు వారితో ఉండాలనేది నిర్ణయిస్తుంది. ప్రస్తుతం నవిష్కతో కల్యాణ్ నాలుగు గంటల సమయమే గడుపుతున్నట్లు అతడి పోస్ట్‌ను బట్టి అర్థం అవుతోంది.
